Begin typing your search above and press return to search.
టీమిండియా క్రికెటర్ ఇంట వరుస విషాదాలు.. మొన్న అమ్మ, ఇప్పుడు అక్క కరోనాతో మృత్యువాత
By: Tupaki Desk | 8 May 2021 8:30 AM GMTదేశంలో కరోనా తీవ్రత వణికిస్తోంది. ఒకప్పుడు ఫోన్ మొగితే చాలు గంటలు గంటలు మాట్లాడేవారు. ఇప్పుడు ఫోన్ రింగ్ అయితే చాలు భయపడుతున్నారు. దానికి కారణం కరోనాతో ఎవరు ఎప్పుడు చనిపోయారోనన్న దుర్వార్త వినాల్సి వస్తుందోనని. టీమిండియా ఉమెన్ క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో కరోనా తీవ్ర విషాదం నింపింది. ఆమె ఇంట వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండు వారాల కిందట కరోనా బారిన పడి తన తల్లిని కోల్పోయిన వేద ఇప్పుడు తన అక్క వత్సలను కూడా కోల్పోయి తీవ్ర విషాదం లో కూరుకుపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
బెంగళూరులో ఉంటున్న వేద కృష్ణమూర్తి కుటుంబంలోని కొందరికి కొద్ది రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వాళ్లు హోం ఐసోలేషన్ కే పరిమితమై చికిత్స తీసుకుంటూ వచ్చారు. అయితే వేద తల్లి చెలు వాంబ దేవికి శ్వాస తీసుకోవడంలో సమస్య రావడంతో ఆమెను చిక్కమగళూరు జిల్లా కడూరు లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స ఫలితంగా ఆమె చనిపోయారు.వేద తండ్రి కృష్ణమూర్తి, అక్క వత్సలకు కూడా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కడూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. వత్సలకు పరిస్థితి విషమించడంతో గురువారం ఆమె మరణించింది.
రెండు వారాల కిందట తల్లి, ఇప్పుడు సోదరిని కోల్పోయిన వేద తీవ్ర విషాదంలో కూరుకు పోయింది. తన సోదరి మరణ వార్త గురించి ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. 'కరోనాతో తన తల్లి, సోదరిని కోల్పోవడం ఎంతో బాధించింది. ఈ కల్లోల సమయంలో అందరూ తమకు అయిన వాళ్ళను సురక్షితంగా చూసుకోవాలని' వేద ట్వీట్ చేసింది. కర్ణాటకకు చెందిన వేద కృష్ణమూర్తి ఇప్పటివరకు భారత జట్టు తరఫున 48 వన్డేలు, 74 టీ20 మ్యాచ్ లు ఆడింది. ఉమెన్ క్రికెటర్ల జట్టులో చలాకీగా పేరు తెచ్చుకుంది.