Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రానికి వెళ్లిన పీకే బ్యాచ్ కు దిమ్మ తిరిగే షాక్.. కమలనాథుల కొత్త తంత్రం
By: Tupaki Desk | 27 July 2021 4:21 AM GMTఎన్నికల వ్యూహకర్త.. దేశంలోని ఏ రాష్ట్రమైనా సరే.. రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి పరిస్థితులు బనెలకొన్నాయి? ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? వాటిని మార్చటానికి ఉన్న మార్గాలేమిటి? గెలుపు గుర్రాల్ని డిసైడ్ చేయటం ఎలా? లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ఫార్ములా ప్రశాంత్ కిశోర్ దగ్గర ఉందంటారు. ఆయనే కాదు.. ఆయన సిబ్బంది క్షేత్రస్థాయిలో జరిపే పర్యటనలు.. స్థానిక ప్రజలతో మమేకం కావటంతో పాటు.. వారి మూడ్ ను గుర్తించటంలో వారికున్న ప్రతిభను ఎవరూ వంక పెట్టలేరు.
రాష్ట్రం ఏదైనా సరే.. తమకు అప్పగించిన పనుల్ని నూటికి నూరు శాతం న్యాయం చేసేలా చేయటంతో వారికున్న టాలెంట్ మీద ఎవరికి అనుమానాలులేవు. ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐ-ప్యాక్ (భారత రాజకీయ కార్యాచరణ కమిటీ) సభ్యులకు ఎప్పుడూ లేని రీతిలో చేదు అనుభవం ఎదురైంది. వారు తాజాగా త్రిపుర మీద ఫోకస్ చేశారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం.. వారికి ఇప్పటివరకు ఎదురుకాని షాక్ ఎదురైంది. తమకు అప్పగించిన టాస్కునుపూర్తి చేయటమే లక్ష్యంగా పని చేసే పీకే బ్యాచ్ ను త్రిపుర అధికారులు అడ్డుకున్నారు. అంతేకాదు.. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్న వైనం చూస్తే.. విషయం ఇట్టే అర్థమైపోతుందని చెబుతున్నారు.
త్రిపురలో మమత పార్టీ అయిన టీఎంసీకి ఉన్న అవకాశాలు ఏమిటన్న విషయంపై మదింపు చేయటానికి ఐ ప్యాక్ కు చెందిన కమిటీ ఒకటి ఆ రాష్ట్ర రాజధాని అగర్తలకు చేరుకుంది. ఈ టీం ఒక హోటల్ లో బస చేసింది. మొత్తం 22 మంది ఉన్న ఈ టీం తమ పని షురూ చేసే సమయంలో వారిని అడ్డుకున్నారు పోలీసులు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కారణం ఏమిటన్న విషయాన్ని వారు ప్రశ్నించారు. అంతేకాదు.. వారి పర్యటన గురించి వివరాలు తెలుసుకునేందుకు సభ్యులంతా హోటల్ గదులకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు.
దీంతో.. పీకే బ్యాచ్ కు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. తమ పని తాము చేసుకోవటానికి ఉన్న ఇబ్బంది ఏమిటన్న ప్రశ్నకు పోలీసులు సూటిగా సమాధానం చెప్పటం లేదన్న మాట వినిపిస్తోంది. పోలీసుల తీరును టీఎంసీ తీవ్రంగా తప్పు పట్టింది. బీజేపీ నాయకత్వంలోని త్రిపుర ప్రభుత్వం తీరుకు అక్కడి ప్రజలు విసిగిపోయారని.. వారంతా టీఎంసీకి మద్దతుగా నిలవటానికి సిద్ధం కావటంతో.. ఆ విషయం బయటకురాకుండా ఉండేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా.. దేశంలో మరే రాష్ట్రంలో ఎదురుకాని విచిత్రమైన అనుభవం పీకే టీంకు తాజాగా ఎదురైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ విషయంపై పీకే ఏలా రియాక్టు ఏమని అవుతారో చూడాలి.