Begin typing your search above and press return to search.
కి'లేడీ' షాకింగ్ వార్నింగ్.. పెదవి విప్పితే ప్రభుత్వమే పడిపోతుంది
By: Tupaki Desk | 7 Dec 2022 4:22 AM GMTతన అందంతో ప్రముఖులను తన దారికి తెచ్చుకొని.. వారితో సన్నిహితంగా ఉండటమే కాదు.. లెక్కలేనన్ని ఆస్తులు.. అంతకు మించిన అధికారాన్ని ప్రదర్శించే బ్యూటీఫుల్ కి'లేడీ' అర్చనా నాగ్ ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. సంచలన వార్తలకు కాస్తంత దూరంగా ఉండే ఒడిశాను జాతీయ స్థాయిలోనూ హెడ్ లైన్స్ లోకి తీసుకొచ్చిన ఘనత ఆమె సొంతంగా చెప్పాలి. ప్రముఖులకు తన అందాన్ని ఎర వేసి.. వారితో అత్యంత సన్నిహితంగా ఉన్న వేళ.. ఫోటోలు.. వీడియోల్ని తయారు చేసిన ఆమె వైనం కలకలాన్ని రేపుతోంది.
ప్రస్తుతం అరెస్టు అయి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆమె.. తాజాగా మీడియా ముందు పెదవి విప్పారు. నాటకీయంగా చోటు చేసుకున్న ఈ పరిణామంలో.. అంతే నాటకీయంగా ఆమె సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను పెదవి విప్పితే ప్రభుత్వమే పడిపోతుందన్న ఆమె.. తన వద్ద రాష్ట్రాన్ని షేక్ చేసే సాక్ష్యాలు ఉన్నాయని.. వాటిని బయటపెడతానని చెప్పారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. తాను మాట్లాడటానికి తగిన సమయం కావాలని.. కనీసం అరగంట పాటు మీడియాతో మాట్లాడాల్సి ఉంటుందని.. తనకు ఆ సమయాన్ని ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు.
తనను ట్రాప్ లో పడేశారని.. తన వద్ద ఉన్న కీలక ఆధారాలు బయటకు వస్తే ప్రభుత్వమే కూలిపోతుందన్న ఆమె.. తన మాటలతో రాష్ట్రంలో రాజకీయ సీన్ మొత్తం మారిపోతుందన్నారు. తన వద్ద ఉన్న ఫోటోలు.. వీడియోలతో ప్రముఖులను బెదిరించి.. భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఆమెను ఈడీ అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఆమెను జైలుకు తరలించటానికి ముందు ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని క్యాపిటల్ ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించారు.
ప్రస్తుతం ఆమెను తమ కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు డిసెంబరు 13న జిల్లా సెషన్స్ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఇప్పటికే ఆమెపై పెట్టిన కేసుల్లో ఆమెతో పాటు.. ఆమె భర్తను కూడా కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు.
కేవలం నాలుగేళ్ల వ్యవధిలో తన అందాన్ని ఎరగా వేసి.. ప్రముఖులు.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే వారిని టార్గెట్ చేసిన ఆమె.. దాదాపు రూ.30 కోట్ల మేర ఆస్తుల్ని కూడబెట్టినట్లుగా చెబుతారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు తనను ఉగ్రవాదిగా ట్రీట్ చేశారన్న ఆమె..
విచారణ అధికారుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తన మీద కక్షతో అరెస్టు చేయించిన వారిని తాను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టనని తేల్చిన ఆమె.. ఎలాంటి దర్యాప్తుకైనా తాను సిద్ధమన్నారు. ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.