Begin typing your search above and press return to search.
ఏలియన్లున్నాయట..తస్మాత్ జాగ్రత్త!
By: Tupaki Desk | 20 Dec 2017 11:30 PM GMTగాలిలో ఎగిరే పళ్లాలను చూశాం....పెద్ద పెద్ద ఫ్లయింగ్ సాసర్లు మా ఇళ్ల పైకప్పుల మీద నుంచి ఎగిరి వెళ్లాయి......అడవిలో ఏలియన్ వంటి వింత ఆకారాలను చూశాం....ఇవన్నీ అమెరికాతో సహా కొన్ని దేశాలలో వినిపించిన పుకార్లు. అయితే, నిజంగానే ఏలియన్లు ఉన్నాయని, ఆ ఎగిరే పళ్లాలు నిజమేనని కొందరి వాదన. మరికొందరైతే. ఏలియన్లపై పరిశోధన చేసేందుకు అమెరికాలో ఏరియా 51 అనే ప్రాంతముందని, అక్కడ గతంలో దొరికిన ఏలియన్లపై రహస్య పరిశోధనలు జరపుతున్నారని చెబుతుంటారు. స్టీఫెన్ హాకింగ్ వంటి మేధావులు కూడా ఏలియన్ల ఉనికి గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. యూఎఫ్ వోల అన్వేషణ కోసం, వాటి ఉనికిని కనిసెట్టేందుకు అమెరికా రక్షణ శాఖ(పెంటగాన్).... `సీక్రెట్ యూఎఫ్ వో హంటింగ్ బ్యూరో` పేరుతో ఏకంగా ఓ మిషన్ ను చేపట్టింది. ఆ మిషన్ మాజీ డైరెక్టర్ లూయీస్..... ప్రపంచం ఉలిక్కిపడే షాకింగ్ న్యూస్ ఒకటి వెల్లడించారు. ఈ భూప్రపంచం మీద మానవులు ఒంటరివారు కాదని లూయీస్ సంచలన ప్రకటన చేశారు.
దేశ రక్షణకు సంబంధించిన చర్యలు తీసుకోవడం, యూఎఫ్ వోల ఉనికిపై నిఘా ఉంచడంకోసం `సీక్రెట్ యూఎఫ్ వో హంటింగ్ బ్యూరో` ను పెంటగాన్ ప్రారంభించింది. 2014 లో అమెరికా రక్షణ శాఖ కు చెందిన కొన్ని యుద్ధ విమానాలు ఎగిరే పళ్లాలను గుర్తించాయని లూయీస్ చెప్పారు. వాటిని రాడార్ లో పరిశీలించామని , అయితే కొద్ది క్షణాల్లోనే అవి మాయమయ్యాయని అన్నారు. అస్పష్టమైన ఆకారాలను - ఎగిరేపళ్లాలను గుర్తించామని చెప్పారు. అయితే, అవి కచ్చితంగా గ్రహాంతరవాసులకు చెందినవని చెప్పలేనని - అదే సమయంలో మానవులు రూపొందించిన ఎయిర్ క్రాఫ్ట్ లు కావని అన్నారు. అయితే, తాను ఇపుడు ప్రభుత్వం తరపున పని చేయడం లేదని - కాబట్టి ఈ విషయాలను అధికారికంగా వెల్లడించలేనని, తన వ్యాఖ్యలు - అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవని స్పష్టం చేశారు.