Begin typing your search above and press return to search.

ఒక్క వజ్రం.. వందల కోట్లకు అధిపతి చేసింది!

By:  Tupaki Desk   |   31 Jan 2021 11:30 PM GMT
ఒక్క వజ్రం.. వందల కోట్లకు అధిపతి చేసింది!
X
ఆఫ్రికా అంటే వెనకబడిన ఖండం. ఆ ఖండంలోని చాలా దేశాలు చాలా కటిక దరిద్రంలో ఉన్నాయి. వ్యాపారాలన్ని పొరుగు దేశం నుంచి వచ్చి చేస్తున్నారు. అయితే ఆ దేశాలు చేసుకున్న పుణ్యం ఏమిటంటే ఇప్పటికీ అక్కడి దేశాల్లో స్వచ్ఛమైన, బంగారం, వజ్రాలు లభిస్తున్నాయి. అయితే వాటిలో మెజారిటీ శాతం ఇతర దేశాల నుంచి వచ్చి చేస్తున్నవారే.తాజాగా ఆఫ్రికలోని ఓ గనిలో 378 క్యారెట్ల డైమండ్ దొరికింది. దీని ధర ఆకాశాన్ని తాకుతోంది. దాని రేట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. ఒక్క వజ్రమే రూ.110 కోట్ల విలువ చేస్తుందట.

ఆఫ్రికాలోని బొత్సవానాలో కెనడాకు చెందిన లూకారా డైమండ్స్ కు చెందిన గనిలో 378 క్యారెట్ల వజ్రం దొరికింది. ఇది ఎంతో అందంగా ఉందని లూకారా సంస్థ ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ నెల 15, న గనిలో తవ్వకాలు జరుపుతుండగా వజ్రం దొరికినట్లు, ఇది 341 క్యారెట్లు ఉన్నట్టు తెలిపారు. 200 క్యారెట్ల కన్నా ఎక్కువగా ఉన్న 55వ వజ్రం ఇదేనట.

ఈ సుందర మైన వజ్రం ధర ఆఫ్రికన్ కరెన్సీలో 15,మిలియన్ డాలర్లు చేస్తుందట. అంటే మన దేశ కరెన్సీలో రూ. 110 కోట్లు ఉంటుందని వజ్రాల నిపుణులు అంచనా వేస్తున్నారు. 300 క్యారెట్లకు పైగా ఉన్న రెండో వజ్రం ఇదే. ఈ ఏడాది 300 కు పైగా క్యారెట్లుతో వజ్రం దొరకడం ఇదే తొలిసారి. దీన్ని మరింత వెలుగులోకి తెస్తామని లూకారా సీఈవో ఎలిరా థామస్ తెలిపారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మాకు 3,78,341 క్యారెట్ల వజ్రాలు దొరికాయి. ఇంత పెద్ద వజ్రాలు దొరకడం మా అదృష్టమని ఎలిరా థామస్ తెలిపారు. ఈ వజ్రాన్ని మరింత వెలుగులోకి తెస్తామని ఆయన చెప్పారు.