Begin typing your search above and press return to search.
గౌతంరెడ్డికి ఘన నివాళి.. ఈ విషయంలో జగన్ ను మెచ్చుకోవాల్సిందే
By: Tupaki Desk | 9 March 2022 3:29 AM GMTఅనూహ్య మరణాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఫిట్ గా ఉండటం.. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకపోవటం.. క్రమబద్ధమైన జీవితాన్ని ఫాలో అవుతున్న మధ్యవయస్కులైన పలువురు ప్రముఖులు ఈ మధ్యన హటాత్తుగా మరణించటం షాకింగ్ గా మారింది. ఈ మధ్యనే ఏపీ మంత్రి గౌతంరెడ్డి మరణాన్ని మర్చిపోక ముందే.. దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠ్మాన్మరణం ఇప్పుడు అందరిని కలిచివేస్తోంది.
రాజకీయాల్లో ఎలాంటి నేతలు ఉండాలన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే గౌతమ్ రెడ్డి లాంటి నేతలు కాలం చేయటం తెలుగు రాజకీయాల బ్యాడ్ లక్ గా చెప్పాలి. ఎందుకంటే.. అలాంటి విలువలు.. సిద్ధాంతాలు ఉన్న నేతల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. గౌతంరెడ్డి షాకింగ్ మరణం తర్వాత ఆయన తండ్రి కమ్ సీనియర్ వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి సీఎం జగన్ ను మూడు కోరికలు కోరటం తెలిసిందే.
ఇలాంటి వేళలో.. మాట వినటం.. సరే అనటం.. ఆ తర్వాత పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం అధినేతలకు అలవాటే. అందుకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియాక్టు అయ్యారు. ఆయన చేసిన తాజా ప్రకటన విన్నంతనే సీఎం జగన్ ను అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే.. మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరిన మూడు కోరికల్ని తాను తీరుస్తానన్న కీలక ప్రకటనను చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
'అందరూ గుర్తుంచుకునేలా.. చిరస్థాయిగా నిలిచిపోయేలా నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీకి గౌతం రెడ్డి పేరు పెడతాం. మరో ఆరు వారాల్లో సంగం బ్యారేజీ పనులు పూర్తి అవుతాయి. యుద్ధ ప్రాతిపదికన పూర్తి అయ్యేందుకు మంత్రి అనిల్ పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి "గౌతం సంగం" బ్యారేజీ అని పేరు పెట్టి ప్రారంభిస్తామన్నారు. అంతేకాదు.. మేకపాటి గౌతంరెడ్డి సంతాప తీర్మానాన్ని మంగళవారం ఏపీ అసెంబ్లీలో తానే స్వయంగా ప్రవేశ పెట్టిన సీఎం.. గౌతంతో తనకున్న చిరకాల అనుబంధాన్ని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. గౌతం తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరిన కోరికల్ని తీరుస్తామని.. ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి అనుబంధంగా గౌతమ్ పేరు పెట్టి.. అగ్రికల్చర్.. హార్టికల్చర్ కు అనువుగా బోధనా కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కాలేజీని ప్రభుత్వం తీసుకొని మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోరినట్లే గౌతమ్ పేరుతో అగ్రికల్చర్.. హార్టికల్చర్ కోర్సుల్ని ప్రవేశ పెడతామన్నారు.
అంతేకాదు వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోఉదయగిరి ప్రాంతాన్ని రెండో దశలో కాకుండా మొదటిదశలోకి పనులు తీసుకొచ్చి వేగంగా పూర్తి చేస్తామన్నారు. గౌతమ్ రెడ్డి ఇక లేరన్న ఊహే తనకెంతోకష్టంగా ఉందన్న సీఎం జగన్.. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటుగా అభివర్ణించారు. తనకంటేవయసులో ఒక ఏడాది పెద్ద అయినప్పటికీ తనను అన్నగా భావించేవాడన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వేళకు గౌతమ్ రాజకీయాల్లో లేరని.. ఆయన తండ్రి అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారన్న విసయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఈ స్థాయికి వస్తానని ఆ రోజుల్లో ఎవరూ ఊహించి ఉండకపోవచ్చని.. కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చినప్పుడు తనతో అతి తక్కువ మంది మాత్రమే ఉండేవారన్నారు. అలాంటి కొద్ది మందిలో గౌతమ్ ఒకరని.. అలాంటి స్నేహితుడ్ని కోల్పోవటం బాధగా ఉందన్నారు. సన్నిహిత మిత్రుడు అని చెప్పుకోవటం వేరు.. అందుకు తగ్గట్లుగా చకచకా నిర్ణయాలు తీసుకోవటం వేరు. ఈ విషయంలో జగన్ ను అభినందించాల్సిందే.