Begin typing your search above and press return to search.

అల్లుడికి కోసం 67 రకాల వంటలు తయారు చేసిన ఆంధ్రా అత్త!

By:  Tupaki Desk   |   10 July 2020 11:30 PM GMT
అల్లుడికి కోసం 67 రకాల వంటలు తయారు చేసిన ఆంధ్రా అత్త!
X
ఇంటికి కొత్త అల్లుడు వస్తున్నాడంటే ఆ ఇంట్లో ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. ఎందుకంటే కొత్త అల్లుడికి ఏమేమి వంటలు చేసినపెట్టాలాని ఆలోచిస్తుంది. అందులో ఆ అత్త ఆంధ్రా అత్త అయితే కొత్త అల్లుడి నోటికి చేతికి గ్యాప్ అసలు ఉండదు.ఈ క్రమంలో కొత్త అల్లుడికి ఓ ఆంధ్రా అత్త పది , పదిహేను రకాల వంటలు కాదు ఏకంగా 67 రకాల వెరైటీ వెరైటీ వంటలు వండి వడ్డించింది. ఆ 67 రకాల వంటలు ఆ ఇంటి అల్లుడు తిన్నాడా లేడా అనేది పక్కన పెడితే..ఈ అత్తగారు చేసిన వంటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అనంత్ రూపంగుడి అనే ట్విటర్ యూజర్ ఈ అత్త వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 67 రకాల ఆహారాలను అల్లుడి కోసం తయారుచేసింది. కేకు నుంచి మొదలుపెడితే చాట్, స్వీట్లు, బజ్జీలు, పులుసు, వడియాలు, లడ్డూలు, రొట్టె.. ఇలా చెప్పుకుంటూపోతే 67 రకాల వంటలు అవి. ఆమె ఈ వీడియోలో ఒక్కో వంటకం, వెరైటీల గురించి చక్కగా వివరించింది. వింటుంటూ..చూస్తుంటే నోరు ఊరిపోతోంది. కానీ అన్నేసి తినలేం అనిపిస్తోంది కదూ. అందుకే ఈ అత్తమ్మ ఐదు పూటలు అని అంటోంది.

మీ చేతి వంట ఎంత రుచిగా ఉంటే మాత్రం అన్నేసి అల్లుడు తింటాడా? భుక్తాయాసం వచ్చి ఏమన్నా అవగలదేమో జాగ్రత్త’ అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ‘మీక మదర్-ఇన్-లా ఆఫ్ ఇండియా అని అవార్డ్ ఇవ్వాల్సిందే. ఇంత మంచి అత్తలు అల్లుళ్లకు దొరకడం ఏ జన్మ పుణ్యమే’ అని మరొకరు జోక్ వేశారు. మరికొందరు ”మదర్-ఇన్-లా ఆఫ్ ఇండియా” అంటూ పొగిడేస్తున్నారు.