Begin typing your search above and press return to search.
చరిత్రకు అడుగు దూరంలో మన తెలుగమ్మాయ్.. ఆల్ ద బెస్ట్ చెబుదాం
By: Tupaki Desk | 19 May 2022 2:44 AM GMTగడిచిన నాలుగైదు రోజులుగా అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో మన క్రీడాకారులు మెరుపులు మెరిపిస్తున్నారు. బ్యాడ్మింటన్ విషయంలో థామస్ కప్ ను సొంతం చేసుకొని అరుదైన రికార్డును క్రియేట్ చేయటం మొదలు పలు టోర్నీల్లో మనోళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
తాజాగా ఆ కోవలోకే వస్తుంది తెలుగమ్మాయ్ నిఖత్ జరీన్. ఇస్తాంబుల్ లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ కోసం భారతకు చెందిన మహిళా బాక్సర్లు డజను మంది ఈ టోర్నీలో పాల్గొంటే.. తెలుగమ్మాయ్ నిఖిత మాత్రం ఏకంగా ఫైనల్ లో అడుగు పెట్టింది.
దీంతో.. ఆమెకు రజతం కన్ఫర్మ్ కాగా.. పసిడి కోసం మరో పోటీ మిగిలింది. అందులో కానీ విజయం సాధిస్తే.. స్వర్ణాన్ని సాధించటం ద్వారా భారత కీర్తి పతాకం వినువీధుల్లో ఎగిరేలా చేయటం ఖాయం.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వరల్డ్ చాంఫియన్ షిప్ లో తొలిసారి బరిలోకి దిగిన నిఖత్.. తొలి అడుగులోనే స్వర్ణం సాధించే దిశగా అడుగులు వేయటం.. ఆ లక్ష్యానికి మరో అడుగు మాత్రమే మిగిలి ఉండటం విశేషం.
సెమీ ఫైనల్స్ లో బ్రెజిల్ కు చెందిన కరోలిన్ డి అల్మేడియాను ఆమె 5-0తో చిత్తు చేసింది. 52 కేజీల విభాగంలో ఆమె పసిడి పతకం కోసం పోరు సలపనుంది. ఈ రోజు జరిగే పోటీలో ఆమె థాయ్ లాండ్ బాక్సర్ జుటామస్ జిట్ పోంగ్ ను ఢీ కొననుంది. ప్రపంచ జూనియర్ బాక్సింగ్ మాజీ చాంపియన్ నిఖత్.. సెమీస్ లో తన అధిక్యతను సంపూర్ణంగా ప్రదర్శించింది.
తన పంచ్ పవర్ ను చూపిన ఆమె దెబ్బకు బ్రెజిల్ బాక్సర్ ను అయోమయానికి గురి చేయటమే కాదు.. తొలి రౌండ్ లోనే ముగ్గురు జడ్జిలు 10కి 10 మార్కులు వేయటం చూసినప్పుడు ఆమె ఎంత ధాటిగా ఆడిందన్న విషయం అర్థమవుతుంది. ఏమైనా.. మన తెలుగమ్మాయ్ వరల్డ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం కోసం అడుతున్న వేళ.. ఆమె లక్ష్యానికి చేరుకోవాలని ఆశిద్దాం. మనమ్మాయి కోసం మనమంతా ఆల్ ద బెస్టు చెబుదాం.