Begin typing your search above and press return to search.

గాడ్సే నాకు ఆదర్శం అన్న విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్..!

By:  Tupaki Desk   |   18 Feb 2022 12:27 AM GMT
గాడ్సే నాకు ఆదర్శం అన్న విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్..!
X
గుజరాత్ లోని ఓ స్కూల్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీనికి కారణం ఆ స్కూల్ లో నిర్వహించిన ఓ వక్తృత్వ పోటీలు. పిల్లల్లో ఉండే టాలెంట్ ను వెలికి తీసే కార్యక్రమం తో ఏంటి వివాదం అనుకుంటున్నారా? ఆ పోటీల్లో ఆ స్కూల్ వారు ఇచ్చిన అంశాలు అలా ఉన్నాయి మరి. మన దేశ జాతిపితగా అయిన మహాత్మా గాంధీని తిట్టిస్తూ... నా హీరో గాడ్సే అని అనిపించడమే. దీంతో ఆ పాఠశాల సిబ్బంది ఇబ్బందుల్లో పడింది.

వల్సాద్ జిల్లాలోని ఈ పాఠశాల సిబ్బంది నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో మహాత్మా గాంధీని దూషించేలా అంశాలు ఇచ్చారు. అయితే ప్రైజ్ అంటే ఆశించే పిల్లల్లోని ఓ విద్యార్థి గాంధీని నోటి వచ్చినట్టు మాట్లాడాడు. అంతే కాకుండా తనకు జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను తన హీరోగా భావిస్తాను అని ఆ పిల్లాడి నోటి గుండా మాటలు వచ్చేలా చేశారు. గాంధీని చంపిన గాడ్సేనే నాకు ఆదర్శం అని చెప్పిన ఆ విద్యార్థికి ఏకంగా పోటీలో మొదటి బహుమతి ఇచ్చి సత్కరించారు.

అయితే ఇప్పుడు ఇది రాష్ట్రం లోనే పెద్ద వివాదంగా మారింది. జాతిపితను చంపిన వ్యక్తిని హీరోగా భావిస్తున్నానని ఆ విద్యార్థి చెప్పడం ఒక ఎత్తు అయితే.. అందుకు ఆ పోటీకి జ్యూరీ సభ్యులు మద్దతు తెలిపినట్లుగా ఎక్కువ పాయింట్లు వేసి అతనికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

ఈ పోటీల్లో జ్యూరీ సభ్యులు ముఖ్యంగా మూడు టాపిక్ లు ఇచ్చారు. వాటిలో మొదటిది గాడ్సే నాకు ఆదర్శం ఎందుకంటే అనేది ఒకటి. తరువాతది ఎగిరే పక్షులు అంటే నాకు ఇష్టం ఎందుకంటే? మూడోది పెద్ద అయితే నేను శాస్త్రవేత్తను అవుతాను కానీ విదేశాలకు వెళ్లను. ఈ మూడు అంశాల్లో దేనినైనా ఒక దానిని తీసుకుని తీసుకుని దాని గురించి మాట్లాడాలి.

పూర్తి గా విశ్లేషణాత్మకంగా మాట్లాదితే వారికి ప్రై జ్ ఇవ్వాలి. అయితే నిర్వహకులు గాడ్సేని పొగుడుతూ.. గాంధీని తిట్టిన బాలుడుకు మొదటి బహుమతి ప్రకటించారు. దీనిపై చాలా మంది మండి పడుతున్నారు. అలాంటి పాఠశాలలు ఉండడం నిజంగా మన దురదృష్టకరం అని విమర్శిస్తున్నారు.

ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో ఈ జిల్లా డీఈఓ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ పోటీలు నిర్వహించిన వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు అధికారులు. కానీ ఈ వివాదం అంతటితో సద్దుమణగలేదు. ఆ పోటీలు నిర్వహించిన వారిని, జ్యూరీ సభ్యులను, టాపిక్స్ ఇచ్చిన వారి అందరిపై ఈ వివాదం ముసిరింది. వారి అందరిని బాధ్యులను చేశారు అధికారులు.