Begin typing your search above and press return to search.
కరోనా ఆట కట్టించడానికి ఇటలీ బయల్దేరిన చైనా బృందం !
By: Tupaki Desk | 12 March 2020 12:00 PM GMTకరోనా వైరస్ ... చైనాలోని వూహన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ , అక్కడినుండి కొద్దికొద్దిగా విస్తరిస్తూ ప్రపంచంలోని సుమారుగా 120 దేశాలకి విస్తరించింది. కాగా , ఈ మహమ్మారి వల్ల ఇప్పటివరకూ 4,200 మందికి పైగా మృతిచెందగా, 1,26,000 మందికి వైరస్ సోకింది. కరోనా బాధితుల్లో ఎక్కువ మంది చైనా దేశీయులే ఉన్నారు. చైనా తర్వాత అత్యధిక స్థాయిలో కరోనా వ్యాప్తిని ఇటలీ ఎదుర్కొంటోంది. కరోనా దెబ్బకు విలవిలలాడిపోతోంది. యూరపియన్ దేశంలో కరోనా కోరలు సాచింది. వందలాది మందిని మింగేస్తోంది. ఒకే రోజులో అత్యధిక సంఖ్య లో ప్రాణాలు తీసేసింది. ఈ పరిస్థితుల్లో కరోనా బారి నుంచి ఇటలీకి సాయం చేసేందుకు డ్రాగన్ ముందుకొచ్చింది.
కరోనా కోరలు పీకేందుకు వైద్యనిపుణుల బృందాన్ని ఇటలీకి పంపుతోంది చైనా. ఇప్పటికే ఇరాన్, ఇరాక్ దేశాలకు అవసరమైన సాయాన్ని బీజింగ్ అందిస్తోంది. యూరోపియన్ దేశంలో మంగళవారం ఒక్క రోజే Covid-19 వైరస్ సోకి 168మంది మృత్యువాడపడ్డారు. ఈ కరోనా ప్రభావం తో ఇటలీ మొత్తం లాక్ డౌన్ అయింది. కరోనా వ్యాధితో మృతి చెందిన వారి సంఖ్య 631 మందికి చేరింది. 10వేల మందికి పైగా కరోనా బాధితులు ఉన్నారు.
అలాగే 60 మిలియన్ల మంది నివాసముండే రోమ్ నగరం మొత్తాన్ని నిర్భందం లో ఉంచారు. పక్క దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా వైరస్ కి పుట్టినిల్లు అయిన చైనా దేశంలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ చైనా సంస్థ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందాన్ని ఇటలీకి పంపుతున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. వైద్య పరికరాలతో పాటు అక్కడ అవసరమైన వస్తువులను కూడా సరఫరా చేస్తోంది చైనా. అక్కడి దేశంలో వైద్య పరికరాల కొరత ఉండటం తో చైనా సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని ఇటలీ ఫారెన్ మినిస్టర్ లుయిగి డి మైయో తెలిపారు.