Begin typing your search above and press return to search.
పురంధీశ్వరికి కన్నడ గడ్డపై వరుస షాక్ లు
By: Tupaki Desk | 3 May 2018 12:32 PM GMTకర్ణాటక ఎన్నికల్లో కీలకమైన తెలుగువారి ఓట్లు బీజేపీకి వేయించేందుకు ప్రచారానికి వెళ్లిన బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరికి చుక్కెదురయ్యింది. రాష్ట్రానికి బీజేపీ ఎంతో మేలు చేస్తోందంటూ.. తెలుగు వారి క్యాంప్‌కు వెళ్లి ప్రచారం చేసిన ఆమెను.. ప్రశ్నలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి చేశారు. వరుసగా రెండు రోజుల పాటు ఇలాంటి షాక్‌లే ఎదురవడంతో ఆమె ఇబ్బంది పడాల్సి వస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ విమర్శించిన పురంధేశ్వరి.. జనం ఎదురు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక ఇబ్బందిపడ్డారు. కర్ణాటక కోసం కేంద్రం ప్రత్యేకంగా ఇస్తున్న నిధులు ఏమిటని నిలదీశారు. దీంతో తాను మాట్లాడనంటూ కూర్చుండిపోయారు. మరోవైపు గుడివాడకు చెందిన ఓ రైతు నిలదీతతో ఆమె షాక్‌కు గురయ్యారు.
బీజేపీకి మద్దతుగా తెలుగు వారి ఓట్లను కోరుతూ రాయచూరు జిల్లాలో పురంధేశ్వరి ప్రచారానికి వెళ్లారు. బీజేపీకి ఓటు వేయాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకోవాలని సూచించారు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అసహనానికి గురయ్యారు. `అమ్మా.. పోయిన ఎన్నికల్లో ఇక్కడకు వచ్చి కాంగ్రెస్‌కు ఓటు వేయమని కోరావు. ఇప్పుడు బీజేపీకి ఓటేయమంటున్నావ్. ఏపీకి అన్యాయం చేసిన పార్టీలతోనే ఎప్పుడూ ఎందుకుంటావమ్మా?' అని ఓ తెలుగు రైతు ప్రశ్నించారు. దీంతో ఆశ్చర్యపోవడం పురంధేశ్వరి వంతు అయింది. అయితే ఆమె తేరుకునేలోగానే ఆయన మరిన్ని ప్రశ్నలు సంధించారు. `మాది గుడివాడ. మీ నాన్న ఎన్టీఆర్ గారు టీడీపీ స్థాపించినప్పుడు పార్టీ జెండా మోశా. ఆ అభిమానంతోనే అడుగుతున్నా. మీ స్థానంలో వేరొకరు ఉంటే అడిగేవాన్ని కాదు` అంటూ చెప్పడంతో పురంధేశ్వరి ఆశ్చర్యపోయారు.
దీంతో పురంధేశ్వరి తమాయించుకొని రాష్ర్టాలను బట్టి పరిస్థితులు మారుతుంటాయని వివరించారు. తాను రాజకీయం చేసేందుకు ఇక్కడికి రాలేదని పేర్కొంటూ..కర్ణాటక కోణంలోనే తాను ఈ మాటలు అంటున్నట్లు తెలిపారు. అయితే ఆమె సమాధానంతో వారు సంతృప్తి చెందలేదని సమాచారం.