Begin typing your search above and press return to search.

యోగా కోసం అమెరికా నుండి వస్తే రేప్ చేశాడు !

By:  Tupaki Desk   |   10 Oct 2020 12:30 AM GMT
యోగా కోసం అమెరికా నుండి వస్తే రేప్ చేశాడు !
X
దేశంలో రోజురోజుకి ఆడవారిపై జరిగే అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. కామం తో కళ్లు మూసుకుపోయిన కొంతమంది కామాంధులు నిత్యం సమాజంలో కామాంధులకు పడే శిక్షలు చూసి కూడా రెచ్చిపోతున్నారు. అలాగే , దేశంపై ఉన్న గౌరవం తో ఇతర దేశాల నుండి వచ్చిన మహిళల పై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా రిషికేష్ లో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. యోగా నేర్చుకోవడం కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు స్థానిక వ్యక్తి.

నిందితుడు పలుమార్లు తనను పలుమార్లు రేప్ చేసినట్టు యువతి ఆరోపించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ లోని రుషికేష్‌ లో చోటుచేసుకుంది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు మునికీరేటి పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ ఇంచార్జ్ ఆర్‌ కే సక్లానీ వెల్లడించిన వివరాల ప్రకారం, అక్టోబర్ 5వ తేదీన బాధిత మహిళ గదిలోకి బాల్కనీ ద్వారా ప్రవేశించిన నిందితుడు ఆమెను రేప్ చేశాడు.

అంతకుముందు కూడా నిందితుడు ఆమెను పలుమార్లు రేప్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఆమెకు డ్రగ్స్, యోగా మీద ఇష్టం అభినవ్ రాయ్ ‌తో పరిచయం పెరిగేలా చేసిందని పోలీసులు గుర్తించారు. దీన్ని అభినవ్ ఆమెను పలుమార్లు తన రూమ్‌ కి పిలిచి రేప్ చేసినట్టు చెప్పారు. ఇక, అభినవ్‌ పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని అతడి తండ్రి ఒత్తిడి తెస్తున్నట్టు కూడా బాధిత మహిళ తన ఫిర్యాదులో పొందుపరిచింది.