Begin typing your search above and press return to search.

వైఎస్ నమ్మకాన్ని నిలబెట్టిన యాదవ్

By:  Tupaki Desk   |   3 Jun 2018 3:30 PM GMT
వైఎస్ నమ్మకాన్ని నిలబెట్టిన యాదవ్
X
అవి.. 2014 సార్వత్రిక ఎన్నికలు.. 9 ఏళ్లు పాలించిన బాబు పాలనకు చరమగీతం పాడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే అంతకుముందే రాష్ట్ర మంతా పాదయాత్ర చేసిన వైఎస్ హైదరాబాద్ లో మాత్రం తిరగలేదు. అయినా హైదరాబాద్ పరిధిలోని దాదాపు 20 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీనంతటికి కారణం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్.. ఈ విషయాన్ని స్వయంగా ఈరోజు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి వెల్లడించారు. విలేకరులతో మాట్లాడిన జైపాల్.. అంజన్ పై వైఎస్ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టి భారీ విజయాలను సాధించాడని కొనియాడారు..

ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం నాంపెల్లి రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా గాంధీభవన్ కు చేరుకున్నారు. అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ - జానారెడ్డి - జైపాల్ రెడ్డిల సమక్షంలో ఉత్తమ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గత నాలుగేళ్లలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో పట్టుకోల్పోయింది. కానీ అంజన్ నాయకత్వంలో మళ్లీ పూర్వవైభవం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉంది’ అని అన్నారు. ఇది వరకు 2004లో కూడా అంజన్ కాంగ్రెస్ కు భారీ సీట్లు గెలిపించి ఇచ్చారు . ఇప్పుడూ అదే పునరావృతమవుతుందన్నారు.. ఇక కేసీఆర్ పై జైపాల్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వేడుకలు అన్ని పార్టీలు వేడుకగా జరపాలి. కానీ కేసీఆర్ సొంత వేడుకలా చేసుకుంటున్నాడని ధ్వజమెత్తారు. మెట్రో ట్రైన్ కేసీఆర్ సాధించాడని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని.. సీఎంగా వైఎస్, తాను కేంద్రమంత్రి ఉండగా మెట్రో ను మంజూరు చేశామని.. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలని జైపాల్ సూచించారు.

ఇక గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.. గ్రేటర్ లో టీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కీలకంగా ఉన్నారు. హైదరాబాద్ లో ఏ సమస్య వచ్చినా ఆయనే ముందుంటున్నాడు. హైదరాబాద్ లో చోటుచేసుకునే సినీ, గల్లీ, వివిధ రాజకీయ, వివాదాస్పద విషయాలను తలసాని తనే ముందుండి పరిష్కరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అదే సామాజికవర్గానికి చెందిన అంజన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ బరిలో నిలపడం ఆసక్తి మారింది. యాదవ్ వర్సెస్ యాదవ్ రాజకీయాలు వచ్చే ఎన్నికల్లో ఎవరికీ లాభం చేకూరుస్తాయన్నది ఆసక్తిగా మారింది.