Begin typing your search above and press return to search.
నెల్లూరు కోర్టులో చోరీ కేసులో కీలక మలుపు
By: Tupaki Desk | 26 April 2022 6:33 AM GMTనెల్లూరు జిల్లా కోర్టులో దొంగలు పడి అధికార పార్టీ మంత్రికి చెందిన కేసు తాలూకా పత్రాలు చోరీ కావడం సంచలనమైన సంగతి తెలిసిందే.. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇటీవల అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారు. మరునాడు కోర్టుకు వచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
చోరీకి గురైన వాటిలో కొన్ని పత్రాలను..కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ల్యాప్‌టాప్, 4 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అవి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా భావిస్తున్నారు!
నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇది పెనుదుమారం రేపింది. అధికార పార్టీ నేత ఇటీవల బాధ్యతలు చేపట్టగానే జరిగిన ఈ ఉదంతం పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగింది. దీనిపై చాలా మంంది ఆందోళన బాట పట్టారు.
దుమారం రేపిన ఈ కేసు ఏపీ హైకోర్టుకు తాజాగా చేరింది. కేసు దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదన్న నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా సుమోటో పిల్ గా దీన్ని హైకోర్టు పరిగణించింది. బెంచ్ క్లర్క్ సహా 18మందిపై ఇవాళ విచారణ చేపట్టనుంది. సీఎస్, డీజీపీ, జిల్లా జడ్జి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహా 18మందిని ప్రతివాదులుగా చేర్చారు.
ఈ క్రమంలోనే కోర్టు చోరీ కేసు దర్యాప్తులో లోపాలున్నాయని పీడీజే సంచలన నివేదికను హైకోర్టుకు ఇచ్చారు. నిందితుల వేలిముద్రలు, పాదముద్రలను పోలీసులు సేకరించలేదని.. డాగ్ స్వ్కాడ్ ను కూడా పిలిపించలేదని నెల్లూరు పీడీజే తెలిపారు. ఈ ఘటనపై స్వతంత్ర్య సంస్థతో దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నివేదిక ఇచ్చారు.
-కోర్టులో ఏం దొంగిలించారంటే?
నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కొందరు వ్యక్తులు చొరబడ్డారు. ఓ బ్యాగును ఎత్తుకెళ్లి.. కోర్టు బయట ఉన్న కాలువలో పడేశారు. పోలీసులు దానిని పరిశీలించగా.. అందులో పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. కోర్టులో దొంగతనం జరిగిన మాట వాస్తవమని, దానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, చోరీకి గురైన వాటిలో కొన్ని పత్రాలను..కోర్టు ప్రాంగణంలోనే పడేశారు.
ల్యాప్‌టాప్, 4 మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అవి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా భావిస్తున్నారు!