Begin typing your search above and press return to search.
తెలంగాణలో కరెంటు కోతలపై బొత్సకు .. టీ విద్యుత్ అధికారుల షాక్!?
By: Tupaki Desk | 30 April 2022 3:03 PM GMTఏపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించిన విషయం తెలిసిందే. కేటీఆర్.. తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి గురించి తన స్నేహితుడు చెప్పింది విని కేటీఆర్ చెప్పారన్న బొత్స... తాను హైదరాబాద్ వెళ్లి ఉండి వస్తున్నానని అన్నారు. హైదరాబాద్‌లో అసలు కరెంటే ఉండటం లేదని చెప్పారు. రోజుల తరబడి జనరేటర్ పెట్టుకున్నానని అన్నారు. తన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకోవాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. బాధ్యత కలిగిన వ్యక్తి అలా మాట్లాడటం సరైంది కాదని అని హితవు పలికారు.
కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవాలని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని బొత్స హితవు పలికారు. ‘‘కేటీఆర్ చెప్పినట్టయితే మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడడం లేదా? ఆయనకు ఆయన ఫ్రెండ్ చెప్పాడు... నేను హైదరాబాద్‌లో ఉండి వస్తున్నా. అక్కడ కరెంటే లేదు. నేను కూడా అక్కడ జనరేటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చింది. కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవచ్చు. అంతేగానీ ఇలా అంటారా? ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడోచ్చా? ఆయన తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలి’’ అని బొత్స పేర్కొన్నారు.
"ఏపీలో కరెంట్, నీళ్లు లేవని కేటీఆర్కు తన ఫ్రెండ్ చెప్పారన్నారు. ఆయన చూడలేదు. నేను స్వయంగా హైదరాబాద్ నుంచే వస్తున్నా. అక్కడసలు కరెంటే లేదు. దానికి ఏం సమాధానం చెప్తారు. జనరేటర్ వినియోగించాం. బాధ్యత కలిగిన వ్యక్తిగా అలా మాట్లాడటం సరికాదు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.`` అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే.. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ విద్యుత్ శాఖ(టీఎస్ డీపీఎల్) అధికారులుస్పందించారు. ``బొత్సగారు.. మీరు జనరేటర్ వాడుకుంటున్నందుకు క్షమించండి. మా వల్లమీకు అసౌకర్యం కలిగింది. అయితే.. మీరు 15 నెలల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. వాటిని చెల్లిస్తే.. వెంటనే మీ ఇంటికి విద్యుత్‌ను పునరుద్ధరిస్తాం!`` అని ట్వీట్ చేశారు. ఈ పరిణామాలతో అసలు తెలంగాణలో విద్యుత్ లేదని వ్యాఖ్యానించిన బొత్సకు.. ఆయన కరెంటు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న వాస్తవాన్ని అక్కడి అధికారులు తేల్చి చెప్పడం గమనార్హం. మరి దీనిపై బొత్స ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
కొసమెరుపు: అయితే.. టీఎస్ విద్యుత్ శాఖ అధికారులు చేసిన ట్వీట్‌లో వాస్తవం లేదని.. కొందరు బొత్సకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నే ఇలా నకిలీ అకౌంట్ నుంచి ట్వీట్ చేసి ఉంటారనే చర్చ కూడా జరుగుతుండడం గమనార్హం.ఈ అకౌంట్ ఆఫీసియల్ లేక ఫేక్ న అనేది తెలియలిసి ఉంది