Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో ట్విస్ట్

By:  Tupaki Desk   |   5 Feb 2021 2:14 PM GMT
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో ట్విస్ట్
X
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో ట్విస్ట్ నెలకొంది. గ్రామం ఎన్నికలను బహిష్కరించింది. అధికారులు ఎంత ప్రయత్నం చేసినా వాళ్లు వెనక్కి తగ్గ లేదు. ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయకుండా ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో ఆ గ్రామంలో ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కర్నూలు జిల్లా కోడుమూరు పరిధిలోని పూడూరులో గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు. ఎవరూ ఎన్నికల్లో పోటీచేయవద్దని ప్రభుత్వంపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా పూడూరుకు చాలా కాలంగా రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.పూడూరుకు సమీపంలో ఇసుక రీచ్ ఉండడంతో రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. ఆ రోడ్డును బాగు చేయాలని ఎంతమందికి విజ్ఞప్తి చేసినా వినిపించుకున్న దాఖలాలు లేవు. దీంతో పలువురిని ఆస్పత్రికి తరలించలేక మృత్యువాతపడ్డారు.

ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోపవడంతో తాజాగా ఎన్నికలను బహిష్కరించాలని ఊరి ప్రజలంతా నిర్ణయం తీసుకున్నారు. ఏకతాటిపైకి వచ్చి ఒక్క నామినేషన్ వేయకుండా షాకిచ్చారు. కలెక్టర్ సహా అధికారులంతా గ్రామస్థులకు నచ్చ చెప్పినా రోడ్డు కోసం ఏకంగా రోడ్డు వేసిన తర్వాతే ఎన్నికలు అంటూ అధికారులను వెనక్కిపంపారు. పూడూర్ గ్రామస్థుల ఎన్నికల బహిష్కరణ నిరసన ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది.