Begin typing your search above and press return to search.

అమరావతి కుంభకోణంలో ట్విస్ట్

By:  Tupaki Desk   |   18 March 2021 12:32 PM GMT
అమరావతి కుంభకోణంలో ట్విస్ట్
X
అమరావతిలో భూకుంభకోణం వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ఏపీ సీఐడీ విభాగానికి ఫిర్యాదు చేసిన వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఈరోజు చంద్రబాబుపై ఆధారాలు సీఐడీకి సమర్పించారు. సీఐడీ విచారణకు పిలవగా.. తన వద్దనున్న ఆధారాలు సమర్పించినట్టు ఆయన మీడియాకు తెలిపారు.

ఈ క్రమంలోనే ప్రతిపక్ష అధినేత చంద్రబాబుపై పోరాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే భద్రతకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.భూములు కోల్పోయిన దళితులు తనకు ఇచ్చిన ఫిర్యాదులను సీఐడీకి అప్పగించానని.. మంగళగిరిలో సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూములు మోసం చేశారని.. తాడికొండలో 3వేల ఎకరాలు ఇలాగే కొట్టేశారని.. వాటిని విచారించాలని ఆర్కే మీడియా ఎదుట చెప్పుకొచ్చారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు.. దళితుల భూములు కొట్టేసిన కేసు వేరని.. ఇందులో జీవోనంబర్ 40 ప్రకారం దళితులు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు లాగేసుకున్నారని ఆర్కే తెలిపారు. 1989 ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్కే తెలిపారు.

ఈ కేసులో స్టే కోరుతూ చంద్రబాబు కోర్టుకు వెళ్లడంపై ఆర్కే ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడానికే చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.అమరావతి భూ కుంభకోణంపై పోరాడుతున్న ఆర్కే కు తాజాగా భద్రత పెంచుతూ జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడున్న గన్ మెన్లకు అదనంగా మరో నలుగురు గన్ మెన్లను ప్రభుత్వం కేటాయించింది.