Begin typing your search above and press return to search.

విక్రమార్కుడు సీన్ రిపీట్.. లక్ష్మీ దేవీకి కోపం వచ్చిందని చెప్పి నిండా ముంచేశారు!

By:  Tupaki Desk   |   5 Nov 2021 5:35 AM GMT
విక్రమార్కుడు సీన్ రిపీట్.. లక్ష్మీ దేవీకి కోపం వచ్చిందని చెప్పి నిండా ముంచేశారు!
X
హరోం హర అత్తిలి చిదబర... అనే మంత్రం మీరు వినే ఉంటారు. రవితేజ కథానాయకుడుగా తెరకెక్కిన హిట్ సినిమా విక్రమార్కుడులో కాలనీ వాసులను బురిడి కొట్టించేందుకు మాస్ రాజా వాడిని డైలాగ్ అది. తనను తాను గొప్ప మహర్షిగా చెప్పుకుంటూ.. లక్ష్మీ దేవి మూట లోపలికి తోస్తది అందరికీ చెప్తూ వారందరికీ అర గుండ్లు కొట్టిస్తాడు. అలాంటి ఘటనే నిజజీవితంలో జరిగింది. మాయమాటలు చెప్పి ఓ మహిళ ఒంటి మీద ఉండే బంగారం, పర్సులోని డబ్బు, చివరాకరుకు తాళి బొట్టును కూడా తీసేపించిం ఉడాయించారు ఇద్దరు స్వామీజీలు. ఈ ఘటన హరియాణాలోని పాన్పట్లో జరిగింది.

హరియాణాలోని పానిపట్లో ఓ మహిళకు కొంత కాలంగా ఆరోగ్యం సరిలేదు. దీంతో కొంత సొమ్మును ఇంటి పక్కనున్న వారి దగ్గర నుంచి తీసుకుంది. స్థానికంగా ఉండే ఆసుపత్రికి చూపించుకుందాం అని వెళ్లింది. డాక్టర్ ఆమె చూసి కొన్ని పరీక్షలు చేసి తగిన మందులు రాశారు. దీంతో ఆమె పక్కన ఉన్న మెడికల్ షాపుకు వెళ్తుండగా మధ్యలో ఇద్దరు సన్నటి వెలుతురులో కనిపించారు. తమన తాముగా గొప్ప స్వామీజీలుగా పరిచయం చేసుకున్నారు. కొంత సేపు ఆమెతో మాటలు కలిపారు. ఆమెకు కష్టాలు ఉన్నాయి అని.. వాటికి విరుడుగు తమకు తెలుసు అని నమ్మబలికారు. వారి చెప్పిన మాటలను విని మహిళ నిజమే అని భ్రమపడింది. వారు చెప్పేది చేస్తే నిజంగానే కష్టాలు తీరిపోతాయి అని అనుకుంది. ఇంతకీ వారు చెప్పిన మాటేంటి అనుకుంటున్నారా? సరిగ్గా విక్రమార్కుడు సినిమాలో రవితేజ చెప్పిందే. 'లక్ష్మీదేవి మీ మీద కోపంగా ఉంది. నేను చెప్పింది చేస్తే అమ్మ మూట లోపలికి తోస్తది.' డబ్బులేకుంటేనే అన్నీ కష్టాలు వస్తాయని గ్రహించలేకపోయిన ఆ మహిళ. లక్ష్మీ దేవీ కోపం పోవాలి అంటే తాను ఏం చేయాలని ఆ స్వామీజీల రూపంలో వచ్చిన దొంగలను అడిగింది.

తన ఒంటి మీద ఉండే నగలు, తన దగ్గర ఉన్న డబ్బును ఓ మూటగా కట్టి తమకు ఇవ్వాలని చెప్పారు. అనంతరం వారు ఉన్న చోటు నుంచి తూర్పుగా 81 అడుగుల దూరం వెళ్లి లక్ష్మీ దేవిని మనసులో ప్రార్థించి తిరిగి రావాలని చెప్పారు. ఇలా చేస్తే అమ్మ కోపం తగ్గతుందని చెప్పారు. వారి మాటలను నిజమే అని నమ్మిన ఆ మహిళ.. తన ఒంటి మీద ఉన్న నగలను వారికి ఇచ్చింది. వారు చెప్పిన దూరం నడిచి, తిరిగి వాళ్లు ఉన్న ప్రదేశానికి వచ్చింది. అక్కడ వాళ్లు లేరు. చుట్టూ పక్కల వారి జాడకోసం వెతికింది. పక్కన ఉన్న వారిని అడిగింది. తమకు తెలియదు అని వారు సమాధానం ఇచ్చారు. దీంతో చివరకు తాను మోసపోయాను అని అర్థం చేసుకుంది. దీంతో చేసేదేమీ లేక స్థానికంగా పోలీస్టేషన్కు వెళ్లింది. తాను మోసపోయిన విధానాన్ని వారికి వివరించింది. ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. మహిళ చెప్పిన దాని ప్రకారం.. ఆమె గురించి పూర్తిగా తెలిసిన వాళ్లే ఈ పని చేసి ఉండోచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలో కూడా దర్యప్తు చేస్తున్నారు. మానవులు బలహీనతలు , నమ్మకాలను ఆసరాగా చేసుకుని మోసాలు చేసే బ్యాచ్ దేశంలో బాగా పెరిగిపోయిందని ఠాణా అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.