Begin typing your search above and press return to search.

ఏపీలో బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

By:  Tupaki Desk   |   18 April 2022 7:30 AM GMT
ఏపీలో బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం
X
గ్రామ వాలంటీర్ల చర్యలు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే పలువురు అత్యాచారాలు, వివిధ అఘాయిత్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోనూ ఓ వాలంటీర్ చేసిన పని ఓ బాలిక జీవితాన్ని చిదిమేసింది.

ప్రబుత్వం నుంచి ప్రజలకు వారధిగా ఉండాల్సిన గ్రామ వాలంటీర్ పెడదోవపట్టాడు. మేలు చేయాల్సిన వాడే కీడు చేశాడు. ప్రభుత్వ పథకాలు అందజేతలో భాగంగా ఇచ్చిన వచ్చిన ఓ వాలంటీర్.. ఆ ఇంటిలోని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం మండలం బొబ్బిలిలంక గ్రామంలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న బూసి సతీష్ (23) అనే యువకుడు బొబ్బిల్లంక గ్రామానికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రభుత్వ పథకాల చేరవేత పేరుతో తరచూ బాలిక ఇంటికి వచ్చే సతీష్ బాలికకు మాయమాటలు చెప్పేవాడు.

ఇటీవల ఇంటిలో బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బాలికను సతీష్ బెదిరించాడు.

ఇక ఆరోజు నుంచి బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు అసలు విషయం ఏంటని నిలదీశారు. దీంతో అది తెలుసుకొని షాక్ అయ్యారు. గ్రామ వాలంటీర్ సతీష్ అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన పోలీసులు వాలంటీర్ సతీష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.