Begin typing your search above and press return to search.

రిషి సునాక్ కు విచిత్ర అనుభవాన్ని ఇచ్చిన ఆసుపత్రి పర్యటన

By:  Tupaki Desk   |   29 Oct 2022 10:30 AM GMT
రిషి సునాక్ కు విచిత్ర అనుభవాన్ని ఇచ్చిన ఆసుపత్రి పర్యటన
X
బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన భారత మూలాలు ఉన్న రిషి సునాక్ కు తాజాగా అనూహ్య అనుభవం ఎదురైంది. ఆయన ఏమాత్రం ఊహించని పరిణామాలకు ఆయన స్పందించాల్సి వచ్చింది. ప్రధాని హోదాలో ఆయన సౌత్ లండన్ లోని క్రొయిడన్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది ఎలా చూసుకుంటున్నారు? బాగా చూసుకుంటున్నారా? అంటూ ప్రశ్నల్ని రిషి అడిగారు. ఈ సందర్భంగా పేషెంట్ల నుంచి వచ్చిన సమాధానం కాస్తంత భిన్నంగా ఉండటమే కాదు.. బ్రిటన్ లో ఇప్పుడు ఈ ఉదంతం వైరల్ గా మారింది.

విషయం ఏమంటే.. వైద్య సిబ్బంది బాగా చూసుకుంటున్నారా? అని పేషెంట్లను అడిగితే.. వారు బాగా చూసుకుంటున్నారని బదులు ఇచ్చిన రోగులు.. "మీరు వాళ్లకు ఇచ్చే జీతాలను చూస్తేనే జాలేస్తోంది. నేషనల్ హెల్త్ సర్వీసును మరింత బలోపేతం చేయాలి. నర్సుల జీతాల్ని పెంచేలా చర్యలు తీసుకోవాలి" అంటూ ప్రధాని రిషి సునాక్ కు సూచనలు అందాయి.

రోగులకు అందుతున్న సేవల గురించి ప్రశ్నిస్తే.. వారు తమ సంగతి కాకుండా.. తమకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది జీతాల గురించి ప్రస్తావించిన వైనంపై రిషి సునాక్ కాస్తంత విస్మయానికి గురయ్యారు. రోగుల సలహాలకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. వారి మాటల్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. నర్సులు.. వైద్య సిబ్బందికి ఇవ్వాల్సిన జీతాల్ని సరిగా ఇవ్వకపోవటం.. పెంపు లేకపోవటంతో ఇటీవల మూడు లక్షల మంది నర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఓటింగ్ నిర్వహించారు.

గడిచిన 106 ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురుకాలేదని చెబుతున్నారు. ఇలాంటి ఓటింగ్ ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఏమైనా రోగులకు అందాల్సిన సేవల గురించి అడిగితే.. వారు తమ గురించి కంటే కూడా.. తమకు సేవలు అందిస్తున్న సిబ్బంది జీతాల గురించి ప్రస్తావించి.. ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని తమ చేతలతో చెప్పేశారని చెప్పాలి. మరి.. దీనిపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.