Begin typing your search above and press return to search.
రాజకీయాల్లో మార్పు కోసం ఈ ఒక్కడు..
By: Tupaki Desk | 2 April 2019 6:46 AM GMTఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంప్ చేస్తున్నవారు ఎందరో.. అలాంటి నేతలకు బుద్ది చెప్పాలని.. నోటాకు ఓటు వేసి ఎలా నిరసన తెలుపాలో ఓ పెద్దమనిషి అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. వినూత్య ప్రచారంతో ఆకట్టుకుంటున్నాడు మాటూరు వెంకట సుబ్బారావు..
ఖమ్మం జిల్లాకు చెందిన సుబ్బారావు రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ నోటాపై ఓటర్లను చైతన్య పరుస్తున్నాడు. పార్టీ మారుతున్న నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ప్రజల్లో ఈ విషయంలో చైతన్యం తెస్తున్నారు. సిద్ధాంతాలు లేని నియకులకు నోటాతో బుద్ది చెప్పాలని కోరారు.
ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.. ‘గత పార్లమెంట్ ఎన్నికల్లో 4991 ఓట్లు నోటాకు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోకవర్గాల్లో 12941 ఓట్లు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో నోటా పై ప్రచారం చేస్తున్నానని.. మంచి నేతలను ఎన్నుకుంటేనే నీతివంతమైన పాలన వస్తుందని’ వివరించాడు.
ఇలా రాజకీయ నేతల జంపింగ్ జపాంగ్ లపై ఆక్రోషించిన సుబ్బారావు చేస్తున్న ప్రచారం వినూత్నంగా సాగుతోంది. అందరినీ ఆలోచింపచేస్తోంది. పార్టీ ఫిరాయింపు పట్ల ప్రజల మనోభావాల్లో మార్పునకు కారణమవుతోంది. నోటాను వాడుకొని నేతలకు బుద్ది చెప్పాలంటున్న సుబ్బారావు ప్రచారంతో కొంతైనా మారితే చాలు అంటున్నారు పలువురు.