Begin typing your search above and press return to search.
టిక్ టాక్..ఆ యువతులు ఇద్దరిని అలా చేసిందట!
By: Tupaki Desk | 27 Sep 2019 7:57 AM GMTఅప్పుడెప్పుడో వచ్చిన బూచోడు పెట్టె (టీవీ)తో భారత సమాజం మారిపోతే.. ఆ తర్వాత సెల్ ఫోన్ మరో కొత్త దరిద్రాన్ని మోసుకొచ్చింది. ఇవి సరిపోవన్నట్లు సోషల్ మీడియాలు.. వాట్సాప్ లతో వ్యవహారాలు అంతకంతకూ మారిపోతుంటే.. టిక్ టాక్ దెబ్బకు చోటు చేసుకున్న పరిణామాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని దుస్థితి.
మొత్తంగా భారత సమాజాన్ని అత్యంత భారీగా ప్రభావితం చేసిన వీటి పుణ్యమా అని.. ఇప్పటివరకూ మనం చూడని కొంగొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఉదంతం కూడా అలాంటిదే. వ్యక్తిగత జీవితాల్నే కాదు.. సంసారాల్ని నాశనం చేసుకుంటున్న వైనాల్ని చూస్తే.. ఈ ప్రయాణం రానున్న రోజుల్లో మరెక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది.
తమిళనాడులోని శివగంగ ప్రాంతానికి చెందిన వినీత అనే 19 అమ్మాయికి నెలన్నర క్రితం లియో అనే వ్యక్తితో పెళ్లైంది. ఉద్యోగంలో భాగంగా సింగపూర్ కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో వినీతను వదిలి అతడు సింగపూర్ వెళ్లాడు. వినీతకు టిక్ టాక్ లో వీడియోలు పోస్టు చేసే అలవాటు ఉంది. ఇది అంతకంతకూ ఎక్కువై.. వ్యసనంగా మారింది. అత్తమామలు.. భర్త ఇలా ఎవరు చెప్పినా లైట్ తీసుకోవటమే తప్ప.. పట్టించుకునేది కాదు.
ఇలాంటివేళ వినీతకు తిరువనంతపురానికి చెందిన అభి అనే అమ్మాయితో పరిచయమైంది. అది కాస్తా స్నేహానికి.. ఆపైన శారీరక సంబంధానికి దారి తీసింది. ఇద్దరు అమ్మాయిల మధ్య పెరిగిన బంధానికి తగ్గట్లే.. వారిద్దరూ కలిసి వీడియోలు పెట్టేవారు. వీటితో అత్తమామలకు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఇష్యూ తెలిసిన భర్త పరుగుపరుగున సింగపూర్ నుంచి వచ్చాడు. తీరు మార్చుకోవాలని చెప్పినా వినకపోవటంతో.. ఆమెను పుట్టింట్లో విడిచిపెట్టాడు. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న బంగారం.. డబ్బును తీసుకొని నచ్చిన తన సహచరి అభితో వెళ్లిపోయింది. బంగారం లాంటి కుటుంబాన్ని ఇలా చేసుకుందే? అంటూ పలువురు ఆమెను తిట్టి పోస్తున్నారు. మరికొందరు మాత్రం.. నచ్చింది చేస్తోంది.. ఏమైందంటూ దబాయించేస్తున్నారు. వామ్మో.. ఇదెక్కడి దరిద్రపు కాలం తల్లీ అంటూ బుగ్గలు నొక్కుంటూ ఆశ్చర్యపోతున్నారు మరికొందరు. డిజిటల్ యుగంలో ఇలాంటివి మరెన్ని చూడాల్సి ఉంటుందో?