Begin typing your search above and press return to search.
వైరల్: ఒంటెను అక్కడ కరిచిన మహిళ..
By: Tupaki Desk | 27 Sep 2019 7:26 AM GMTమనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. కుక్కను మనిషి కరిస్తేనే వార్త అని జర్నలిజంలో ఓ సామెత ఉంది. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఓ ఒంటెను కరిచిన మహిళ వ్యవహారం సంచలనంగా మారింది.
అమెరికాలోని లూసియానాలో జూలో జంతువులను చూసేందుకు తమ పెంపుడుకుక్కతో కలిసి గ్లోరియా లాంకాస్టర్ (68) - ఎడ్మండ్ లాంకాస్టర్ (73) అనే జంట వెళ్లింది. అక్కడ ఒంటెల బోనులోకి వీరి పెంపుడు కుక్క వెళ్లింది. దీంతో ఒంటె ఆ కుక్కపై దాడి చేసింది. కుక్కను కాపాడేందుకు బోనులోకి వెళ్లిన జంటపై కూడా ఒంటె దాడి చేసింది.
ఈ క్రమంలోనే మహిళ గ్లోరియా కుక్కను రక్షించేందుకు కోపంతో ఒంటె వృషణాలను గట్టిగా కొరికింది. ఒంటె కుక్కను విడిచిపెట్టేవరకూ ఇలానే చేసింది. ఆమె భర్త ఎడ్మండ్ ఒంటెపై పిడిగుద్దులు గుద్దాడు.
గమనించిన జూ నిర్వాహకులు వచ్చి గ్లోరియా నుంచి ఒంటెను విడిపించి రక్షించారు. ఒంటె కు రక్తస్రావం కావడంతో వెంటనే అత్యవసర చికిత్స చేశారు. ఒంటెకు మహిళ పంటి గాయం కావడంతో తీవ్రగాయం కారణం యాంటిబయాటిక్స్ ను కూడా మూగజీవానికి ఇచ్చారట.. ఒంటెను కరిచిన మహిళ వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.