Begin typing your search above and press return to search.
ఐఫోన్ తో ఇల్లు కొనేసింది..
By: Tupaki Desk | 1 Nov 2016 9:24 AM GMT స్మార్టు ఫోన్ల కాలంలో స్మార్టుగా ఆలోచించింది ఓ అమ్మాయి.. ఇంకేముంది. అందమే పెట్టుబడిగా - ఐఫోన్ మాధ్యమంగా సొంతింటి కల నిజం చేసుకుంది. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్నవారు - పిల్లలను అమ్మేసినవారు... అప్పులు చేసినవారు - నగలు అమ్మేసిన వారిని చూశాం.. వారందరికీ భిన్నంగా ఈ అమ్మాయి ఐఫోన్లనే అమ్మి ఇల్లు కొనుక్కుంది. అయితే... ఆమె విక్రయించిన ఐఫోన్లు ఎక్కడినుంచి వచ్చాయన్నదే ఇక్కడ ప్రశ్న. ఐఫోన్ల కోసం ఆమె 20 మంది అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసిందట. వారందరితో ఐఫోన్ 7 ఎస్ ఫోన్లు కొనిపించింది. వాటిని అమ్మేసి హాయిగా 14 లక్షలతో ఇల్లు కొనుక్కుంది.
చైనాకు చెందిన ఆ అమ్మాయి ఏకంగా 20 మంది బాయ్ ఫ్రెండ్సుతో ఐఫోన్ 7ఎస్ లు కొనిపించింది. వాటిని వెంటనే huishoubao అనే వెబ్ సైట్లో అమ్మేసింది. వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కొనుక్కుందట.
నిజానికి ఆ అమ్మాయి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఒక్క ఐఫోన్ కొనడం కూడా ఆమె తరం కాదు. అయితే, ఐఫోన్ కంటే ఇల్లు కొనుక్కోవడం ఆమె టార్గెట్ అందుకోసం ఐఫోన్ ను సాధనంగా మార్చుకుంది. అంతమంది బాయ్ ఫ్రెండ్సును ఎలా మెంటైన్ చేసింది... వారందరితోనూ ఐఫోన్ ఎలా కొనిపించింది..? అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఆమె తీరును విమర్శిస్తున్నారు. మరికొందరు ఇదంతా నిజమేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ... huishoubao వెబ్ సైట్ తాము ఓ యువతి నుంచి ఒకేసారి 20 ఐఫోన్లు కొన్నామని ధ్రువీకరించడం.. సోషల్ మీడియాలో ఆమె పనిచేస్తున్న సంస్థ ఉద్యోగి కూడా దీనిపై పోస్టులు పెట్టడంతో నిజమే అని తేలింది. మొత్తానికి తన బాయ్ ఫ్రెండ్ లకు ఏం చెప్పిందో, ఏం చూపించిందో కానీ... అందరినీ బకరాలను చేసి తాను మాత్రం ఒక 'ఇంటి"దైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/