Begin typing your search above and press return to search.
పోలీస్ వాహనంపై బట్టలు విప్పేసి రచ్చ చేసిన మహిళ
By: Tupaki Desk | 16 April 2020 12:30 AM GMTకరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అస్త్రంగా ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. ఈ లాక్‌డౌన్‌ను ఆయా దేశాల్లో పకడ్బందీగా అమలుచేస్తున్నారు. అయితే దీనివల్ల ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇళ్లకే పరిమితమైన ప్రజలు బయటకు అడుగుపెట్టడం లేదు. ఈ క్రమంలో కొందరు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తున్నారు. వారిని పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ప్రజల మధ్య వాగ్వాదం ఏర్పడుతోంది. ఇలాంటి సందర్భంలోనే ఓ మహిళ వీరంగం సృష్టించింది. ఏకంగా బట్టలు విప్పేసి పోలీస్ వాహనం ఎక్కి పోలీసుల తీరును ఎండగట్టింది. ఈ ఘటన ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న స్పెయిన్‌లో చోటుచేసుకుంది.
కేసులు - మృతులు అత్యధికంగా నమోదవుతున్న సందర్భంగా స్పెయిన్ ప్రభుత్వం లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలుచేస్తోంది. లాక్‌డౌన్ ఉల్లంఘించి బయట తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు కోర్టుకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే టర్రెమొలినాస్ లోని కోస్తా డెల్ సాల్ రిసార్ట్ లో నివసిస్తున్న 41 ఏళ్ల మహిళ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. దాంతోపాటు ఆమె చుట్టుపక్కల ప్రజలను విసిగిస్తుందనే కారణంతో పోలీసులు ఆమెను కోర్టుకు అప్పగించారు. అనంతరం కోర్టులో విచారణ జరిగింది. ఆ తర్వాత ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ మంజూరుతో ఉబ్బితబ్బిబైన ఆ మహిళ సంతోషంలో మునిగితేలింది. ఈ క్రమంలో నన్నే అరెస్టు చేస్తారా అంటూ పోలీస్ కారు పైకెక్కి ఆమె తన దుస్తులన్నీ విప్పేసి.. మధ్య వేలు చూపిస్తూ డ్యాన్స్ చేసి రచ్చరచ్చ చేసింది. లాక్ డౌన్ సరికాదని తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను లాఠీతో కొట్టి కిందికి దించారు. ఆ తర్వాత మానసిక పరిస్థితి సక్రమంగా ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు.