Begin typing your search above and press return to search.
హక్కుల కోసం పోరాడి వారికి శత్రువైన మహిళ !
By: Tupaki Desk | 24 Aug 2021 12:30 AM GMTఅశ్రఫ్ గనీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడి జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ దేశం నుంచి పారిపోతున్నారు. ఇక మహిళలతై తమకు భద్రత ఉండబోదని, తమ హక్కులు హరించబడతాయని భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్తాన్‌కు చెందిన ‘డి’ అనే మహిళ అందరి మహిళలతో పాటు ఆందోళన చెందుతోంది. అయితే, ఈమె అందరిలాగా తాలిబన్లు అంటే భయపడలేదు.
ఎప్పటి నుంచో మహిళల హక్కుల గురించి పోరాడింది. తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది. తాలిబాన్లు ఆక్రమించిన సరిహద్దుల్లో ఉన్న సిటీ నుంచి పారిపోయి కాబుల్ వచ్చేసింది ఈ మహిళా హక్కుల ఉద్యమకారిణి. ఈ క్రమంలోనే ఆమె తన అనుభవాలు చెప్తోంది. ఆప్ఘన్ దేశానికి చెందిన మహిళలు, పురుషులు, పిల్లల్ కాబుల్ ఎయిర్ పోర్ట్ గోడలు ఎక్కడానికి ప్రయత్నించారని, ఆగిన విమానాల పైకి ఎక్కి కూర్చుంటూ కనిపించారని తెలిపింది. ఎలా అయినా స్వేచ్ఛను పొందాలనే ఆశతో కొంత మంది యువకులు కదులుతున్న అమెరికా వైమానిక దళ విమానాలకు వేలబడుతూ తనకు కనిపించినట్లు చెప్పింది.
ఇకపోతే ‘డి’ అనే మహిళ తన కొడుకుతో కలిసి విమానం దొరుకుతుందేమోనని కాబుల్ ఎయిర్ పోర్ట్‌లో ఎదురు చూసినట్లు చెప్పింది. ఇగ అక్కడ నిలబడటం వల్ల ఎటువంటి లాభం లేకపోవడంతో, తన కొడుకుతో వెనుదిరిగినట్లు డి తెలిపింది. ఎయర్ పోర్ట్‌లో తన ఎదురుగా వేల మంది ఎయిర్ పోర్టులోకి రావడం మొదలైందని, ఎటుచూసినా గుంపుల కొలదీ జనమే ఉన్నారని, ఆ గుంపుల్లో తాము చిక్కుకున్నామని వివరించింది. అయితే, ఆ గుంపులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ సంచులను దొంగలించారని చెప్పింది హక్కుల ఉద్యమకారణి ‘డి’.
మా దగ్గర ఉన్నటువంటి అన్ని సామాన్లను దోచేసుకుంటుంటే మేము నిస్సాహయంగా ఉండిపోయామని పేర్కొంది. డి..గత రెండు దశాబ్దాలుగా ఆప్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులకు సంబంధించిన గ్రూపులను నిర్వహిస్తోంది. ఆమె బాలికలకు చదువు నేర్పించడంతో పాటు అనాథలైన మహిళలకు ఆశ్రయం కల్పించడం, కౌన్సెలింగ్ ఇవ్వడం, ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలూ చేపడుతోంది. కాగా, ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఆమె తాలిబన్లకు శత్రువుగా మారిందనే చెప్పొచ్చు. తాలిబన్లు తనపై ప్రతీకారం తీర్చుకుంటారేమోనని డి ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఆమె సాయం చేసిన కొంత మంది మహిళల భర్తలు, తండ్రులు ఇతర బంధువులను తాలిబన్లు జైలులో వేశారు.
ఈ క్రమంలోనే చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారికి వ్యతిరేకంగా తాను పోరాడానని, దాంతో వారు జైలు పాలయ్యారని వారు ఇప్పుడు జైళ్ల నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో వారి నుంచి డి కి ముప్పు పొంచి ఉంది. వాళ్లు తన కోసం రాక ముందే డి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. అలా హక్కుల కోసం పోరాటం చేసినందుకుగాను చివరికి ఆమెకు స్వంత నగరంలో జీవించే హక్కు కూడా ప్రశ్నార్థకమైంది. అయితే, తాలిబన్లు ఇంత త్వరగా రాజ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని ఊహించలేదు ‘డి’.
ఈ క్రమంలోనే తమను తాము కాపాడుకునేందుకుగాను డి తన కొడుకుతో కాబుల్ చేరుకోగా, ఆమె భర్త వేరుగా కాబుల్‌కు పయనమయ్యాడు. కొన్ని వేల మంది ఆప్ఘన్ ప్రజల పరిస్థితి నేడు ప్రశ్నార్థకంగా, అనిశ్చితిలో పడిపోయిందని హక్కుల ఉద్యమకారణి ‘డి’ పేర్కొంది. ప్రజల జీవితాలు ఒక్కసారిగా అగాధంలోకి నెట్టివేయబడ్డాయని చెప్తోంది. ఇంత త్వరగా తాలిబన్లు ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోస్తారని అసలు ఎవరూ ఊహించలేకపోయారని అంటున్నారు.