Begin typing your search above and press return to search.

42 సంవత్సరాలుగా టీవీ చూస్తున్న శవం

By:  Tupaki Desk   |   20 Jun 2016 12:34 PM IST
42 సంవత్సరాలుగా టీవీ చూస్తున్న శవం
X
క్రొయేషియాలో కొన్నేళ్ల కిందట జరిగిన సంఘటన సోషల్ మీడియాలో తరచూ చక్కర్లు కొడుతోంది. తాను నివసించే అపార్టుమెంట్లోనే టీవీ చూస్తూ మరణించిన మహిళ శవాన్ని అదే పొజిషన్లో 42 ఏళ్ల తరువాత కనుగొనడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అందులో ఎన్నో సందేహాలకు తావిస్తోంది.

క్రొయేషియాకు చెందిన హెడ్విగా గోలిక్ ఓ అపార్టుమెంటులో నివసించేది. అయితే.. ఆమె చాలాకాలంగా కనిపించడం మానేసింది. ఆమె విదేశాలకు వెళ్లిపోవడమో, లేదంటే ఇంకెక్కడికో వెళ్లిపోవడమో జరిగి ఉంటుందని అపార్టుమెంట్లోని మిగతా నివాసులు భావించేవారు. ఆమె ప్లాటు అలాగే తాళం వేసి ఉండేది. దీంతో కొన్నేళ్ల తరువాత ఆమె ప్లాటును తనిఖీ చేయాలంటూ అపార్టుమెంటు వాసులు పలుమార్లు అధికారులను, పోలీసులను కోరినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. అయితే... ఒత్తిడి చేయడంతో 2008లో ఆమె ప్లాటు తలుపులు బద్దలుగొట్టి లోపలకు వెళ్లగా టీవీ ముందు ఆమె శవం కనిపించిందట. ఆమెను అపార్టుమెంటువాసులు చివరిసారిగా 1966లో చూశారట.. అంటే 42 ఏళ్లుగా ఆమె శవం అక్కడే ఇంట్లోనే ఉందన్నమాట.

అయితే... ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇంట్లోనే శవమైతే మిగతావారికి దుర్వాసన రాకపోవడమేంటన్నది ప్రధాన ప్రశ్నం. ఇంకో విషయం ఏంటంటే ఆమె శవం టీవీ ముందు లేదు బెడ్ లో ఉందని కూడా ఒక వాదన ఉంది. ఇదంతా ఎలా ఉన్నా దశాబ్దాల తరబడి ఇంట్లోనే శవం ఉన్నా పొరుగింటివాళ్లు కూడా పట్టించుకోకపోవడం దారుణమే మరి.