Begin typing your search above and press return to search.
మాజీమంత్రి చేసిన పనికి ఆత్మహత్య చేసుకున్న మహిళ
By: Tupaki Desk | 4 Nov 2019 7:50 AM GMTఈ రోజుల్లో ఎవరికి నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడంలేదు. అప్పటివరకు మనతో బాగుంటు ..వారి అవసరం తీరిన తరువాత వదిలేసిన ఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలలో ఎక్కువగా ప్రముఖులే ఉండటం గమనార్హం. చిన్నగా ముందు మాటలతో పరిచయం పెంచుకోవడం ఆ తరువాత అవసరానికి వాడుకొని.. అవసరం తీరిన తరువాత మొఖం చాటేయడం మాములే. ఈ సంఘటనలు రోజూ చూస్తూనే ఉన్నప్పటికీ ఇంకా మోసపోయేవారి సంఖ్య పెరిగిపోతుంది. తీరా మోసపోయాం అని తెలిసిన తరువాత ప్రాణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి కర్ణాటక రాజధాని బెంగుళూర్ లో జరిగింది.
ఒక బాధ్యతాయుతమైన పదివిలో ఉండి కూడా మోసం చేయడంతో తనకున్న సమస్యలకి మరణమే శరణ్యం అని భావించి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు చూస్తే .. చంద్రాలేఔట్‌కు చెందిన అంజనా వి. శాంతవేరి అనే మహిళ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి బాబు రావ్ చించనసూర్ రూ.11.88 కోట్లు రుణం గా తీసుకున్నారు. ఆ తరువాత అప్పు చెల్లించలేదు. దీంతో అంజన మాజీ మంత్రి పై కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం కోర్ట్ లో జరుగుతుంది.
కానీ , ఆమెకి మరోవైపు అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది. తమ వద్ద తీసుకున్న రుణాలను చెల్లించాలని ఆమెను డిమాండ్ చేయసాగారు. ఒకవైపు తాను ఇచ్చిన డబ్బులు రాకపోవడం, మరోవైపు ఒత్తిళ్లతో జీవితం మీద విరక్తి చెందిన అంజన చంద్రాలేఔట్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె కొడుకుకి ఫోన్ చేసి తన మృదేహానికి నువ్వే నిప్పు పెట్టాలని చెప్పినట్లు తెలిసింది. ఈ ఘటన పై చంద్రాలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసారు. ఈ మద్యే అయన బీజేపీ లో చేరారు. బాబురావ్ స్వస్థలం కలబుర్గి జిల్లా చించోళి.