Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం ఆఫీస్ ముందే మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   2 Nov 2022 9:38 AM GMT
ఏపీ సీఎం ఆఫీస్ ముందే మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. రీజ‌న్ ఇదే!
X
తాను జ‌న‌నేత‌నని ప‌దే ప‌దే చెప్పుకొనే ఏపీ సీఎం జ‌గ‌న్ జ‌నాల‌కు దూర‌మ‌య్యి మూడున్న‌ర సంవ‌త్స‌రాలు గడిచిపోయాయి. ఆయ‌న ప్ర‌జ‌ల‌ను మ‌రిచిపోయార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే, జ‌నాలు మాత్రం ఇంకా జ‌గ‌న్‌ను మ‌రిచిపోలేదు. ఈ నేప‌థ్యంలోనే ''జ‌గ‌న‌న్న ఉన్నాడు. మాకు న్యాయం చేస్తాడ‌'ని కొంద‌రు సీఎంవో చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇటీవ‌ల కోడిక‌త్తి శ్రీను త‌ల్లి కూడా ఇలానే సీఎంవోకు వ‌చ్చి త‌మ‌కుమారుడిని జైలు నుంచి విడిచిపెట్టేలా సాయం చేయాల‌ని అభ్య‌ర్థించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, సీఎం జ‌గ‌న్ వారికి ఛాన్స్ ఇవ్వ‌లేదు. దీంతో ఈ వృద్ధ‌త‌ల్లిదండ్రులు క‌న్నీరు పెట్టుకుని వెనుదిరిగారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా మ‌రో మ‌హిళ త‌న గోడు వెళ్ల‌బోసుకునేందుకునేందుకు సీఎంవోకు వ‌చ్చారు. అయితే, ఆమెకు సీఎం అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. దీంతో తాడేపల్లిలోని సీఎం జగన్‌ కార్యాలయం వ‌ద్దే ఆ మహిళ ఆత్మహత్యకు యత్నించింది.

అచేతన స్థితిలో ఉన్న తన కుమార్తెను కాపాడాలని వేడుకునేందుకు ఆరుద్ర అనే మహిళ సీఎం కార్యాలయానికి వచ్చింది. తన గోడు వెల్లబోసుకునేెందుకు సీఎంతో మాట్లాడాలని ప్రయత్నించిన ఆమెకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని కలత చెంది ఆత్మహత్యాయత్నకు యత్నించింది.

కాకినాడ సమీపంలోని రాయుడిపాలేనికి చెందిన ఈమె.. కుమార్తె చికిత్స కోసం ఇల్లు అమ్ముకోనీకుండా ఓ మంత్రి గన్‌మెన్ బెదిరిస్తున్నారని సీఎం కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసింది. సీఎంను కలిసేందుకు అనుమతించడం లేదన్న ఆమె.. ఇక న్యాయం జరగదనే ఆందోళనతో మణికట్టుపై కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై పోలీసులు స్పందించి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మ‌రో కేసులో..

నిలబడలేక.. కనీసం కూర్చోలేక.. భరించలేని నొప్పితో విలవిల్లాడుతున్న త‌మ గారాల‌బిడ్డ సాయిలక్ష్మీచంద్ర బాధను జగనన్నతో చెప్పుకుందామని వ్యయప్రయాసలకోర్చి వందల మైళ్లు దాటి వచ్చారు సాయిలక్ష్మీచంద్ర తల్లిదండ్రులు. కానీ.. జగన్‌ దర్శనం దొరకలేదు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రతాసిబ్బంది మనసు కరగలేదు. సీఎంను కలిసేందుకు అనుమతించలేదు. దీంతో వారు కూడా క‌న్నీరుమున్నీర‌య్యారు. చిన్నప్పుడే వెన్నెముక సమస్యతో చక్రాలకుర్చీకి పరిమితమైంది సాయిలక్ష్మీచంద్ర. తల్లిదండ్రులు అనేక ఆస్పత్రులు తిరిగారు.

ఇప్పటిదాకా మూడుసార్లు వెన్నుపూసకు శస్త్రచికిత్స చేయించారు. కోలుకోకపోవడంతో,...మరోసారి ఆపరేషన్ అవసరం పడింది. ఆస్తులు పోగేసి,... అప్పులు చేసి, ఇప్పటికే లక్షలు ఖర్చుచేసిన ఆ కుటుంబానికి కొత్తగా అప్పూ పుట్టడం లేదు. కన్నబిడ్డ ఆరోగ్యం నానాటికీ క్షిణిస్తోంది. సీఎం సహాయ నిధి కోసం ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు అన్నవరంలో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఇది కూడా ముందుకు సాగడం లేదు. దీంతో ఆమె బాధ‌ను జ‌గ‌న్‌కు చెప్పుకొనేందుకు వ‌స్తే.. ఆయ‌న ద‌ర్శ‌నం ల‌భించ‌డం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.