Begin typing your search above and press return to search.
టిక్ టాక్‌తో ట్రాప్..రోడ్డునపడ్డ యువతి..తీరా చూస్తే అతడు మైనర్
By: Tupaki Desk | 8 Oct 2020 12:03 PM GMTటిక్‌టాక్ పరిచయం ఓ యువతి కొంపముంచింది. కన్నుమిన్నూ కానకుండా టిక్‌టాక్‌లో పరిచయమైన పదిహేడేళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకోవడంతో ఆమె జీవితం నాశనమైంది. ఈ కేసును ఎలా డీల్‌చేయాలో తెలియక పోలీసులు తికమకపడుతున్నారు. టిక్‌టాక్‌లో పరిచయమైన వ్యక్తి తనను మోసగించాడని శారీరకంగా ఎన్నోసార్లు వాడుకున్నాడని.. ఇప్పుడు నన్ను పెళ్లిచేసుకోకుండా మొహం చాటేస్తున్నాడని సదరు యువతి మీడియాను ఆశ్రయించింది. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన ఓ యువతికి కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఓ యువకుడు టిక్‌టాక్‌లో పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమగా మారడంతో శారీరకంగా ఒక్కటయ్యారు. అయితే ఈ ఇటీవల యువకుడు ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొని అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో ఆ యువతి పీలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసులు కూడా తననే దూషిస్తున్నారని.. యువకుడికి అనుకూలంగా మాట్లాడుతున్నారని యువతి ఆవేదన వ్యక్తం చేస్తున్నది. అతడిపై కేసు పెట్టకపోయినా పర్వాలేదు. కానీ తనను పెళ్లి చేసుకుంటే చాలని యువతి చెబుతున్నది. అయితే యువకుడికి 17 ఏళ్లు మాత్రమే ఉండటంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తికమకపడుతున్నారు. పోలీసులు స్పందించి యువకుడి తో తనకు వివాహం జరిపించాలని మదనపల్లె డీఎస్పీ రవి మనోహర్ ఆచారిని కోరినట్లు ఆమె మీడియాకు వెల్లడించింది.
అయితే పీలేరు పోలీసుల వాదన మరోలా ఉంది యువతి గతంలోనూ ఇదే తరహాలో కేసుపెట్టిందని వారు చెబుతున్నారు. 2019 ఆగస్టు 15న పీలేరుకు చెందిన రాజ్ అనే యువకుడు కూడా తనను శారీరకంగా వాడుకొని వదిలేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్ కి కూడా పంపినట్టు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె ఇష్ట పడ్డ అబ్బాయి మైనర్ కావడంతో అతడితో పెళ్లిచేయడం కుదరదు. కేసు పెట్టేందుకు ఆ యువతి నిరాకరిస్తున్నది. దీంతో పోలీసులకు ఎటూ పాలు పోని పరిస్థితిలో ఉన్నారు.