Begin typing your search above and press return to search.
మరో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులకు షాక్ ..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు !
By: Tupaki Desk | 13 Jun 2020 11:30 AM GMTఏపీలో ఇప్పుడు కేసుల పర్వం నడుస్తుంది. ESI స్కామ్ లో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన రోజే మరో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రుల మీద ఓ ఫిర్యాదు వచ్చింది. అలాగే ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, చంద్రబాబు హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన చినరాజప్ప, ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు మీద ఓ దళిత యువతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
తన భర్తకు రెండో వివాహం చేయించేందుకు యనమల, చినరాజప్ప ప్రయత్నించారని ఆరోపించింది. కాకినాడ రూరల్ మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు రాధకృష్ణతో తొమ్మిదేళ్ళ క్రిందట ప్రేమ వివాహం చేసుకుంది మంజు ప్రియ. వారికి ఇద్దరు పిల్లలు. గత కొంత కాలంగా భర్తని కాపురానికి పంపకుండా వేధించడంతో మార్చి 10న ఇంద్రపాలెం పోలీసు స్టేషన్ లో అత్తమామలపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.
నిన్న తెల్లవారుజామున రాధాకృష్ణ కు రెండో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. యనమల స్వగ్రామమైన ఎవీ నగరంలో వివాహ ఏర్పాట్లు చేశారు. ఆ వివాహనికి యనమల, చినరాజప్ప కూడా హాజరయ్యారు. భాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ రెండో వివాహం ఆగిపోయింది. అయితే, తన అత్తమామల తో పాటుగా యనమల, చినరాజప్పలపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది మంజు ప్రియ. మంజు ప్రియ ఫిర్యాదుతో తొండంగి పోలీస్‌స్టేషన్ లో ఏడుగురిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఏ1 పిల్లి రాధాకృష్ణ, ఏ2 పిల్లి సత్యనారాయణ, ఏ3 పిల్లి అనంతలక్ష్మి, ఏ4 యనమల కృష్ణుడు, ఏ5 యనమల రామకృష్ణుడు, ఏ6 చినరాజప్ప, ఏ7 సరిదే హరిలుగా ఎఫ్ ఐఆర్ నమోదైంది.