Begin typing your search above and press return to search.
ఎన్నికలకు ఏడాది ముందే టీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాల.. కేసీఆర్ క్రొకడైల్ ఫెస్టివెల్ నే?
By: Tupaki Desk | 20 Dec 2022 7:30 AM GMT2023లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అంటే నేటికి సరిగ్గా ఏడాది సమయం. ఇన్నాళ్లు అధికార పార్టీ అని అందరు ఎమ్మెల్యేలు గమ్మున ఉన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత టీఆర్ఎస్ లో బోలెడంతా ఉంది. మరోసారి గెలుపు కష్టమేనంటున్నారు. అందుకే ఉన్న ఎమ్మెల్యేల్లో పదవులు దక్కలేదని.. ఈ పార్టీలో ఉంటే కష్టమని అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు బరెస్ట్ అయ్యారు. ఏకంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టి మంత్రి మల్లారెడ్డి ఆధిపత్యాన్ని సహించమని తొలగించాలని తిరుగుబావుటా ఎగురవేశారు. మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశం కావడం బీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. ఇక అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా గుంభనంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇన్నాళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ మాట జవదాటేవారుకాదు.. ఆయనంటే భయం, భక్తి ప్రదర్శించేవారు. కానీ కేసీఆర్ నియమించిన మంత్రికి వ్యతిరేకంగా బాహాటంగా మీడియా ముందుకు ఎక్కడం నిజంగానే కేసీఆర్ కు మింగుడుపడని విధంగా ఉంది. ఈ వ్యవహారాన్ని తేలుస్తారా? అని కేసీఆర్ వద్దకు వెళితే అది వేరేలా ఉండేది. కానీ మీడియా ముఖంగా ఈ అసమ్మతి రాజేయడంతో ఇక బీఆర్ఎస్ లో కేసీఆర్ పై తిరుగుబాటుగానే చెప్పొచ్చు. ఇది అంతిమంగా మరింత మంది గళమెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది.
ఓవైపు బీజేపీ కాచుకొని ఉంది. బీఆర్ఎస్ లో అసమ్మతి చెలరేగితే వారిందరినీ బీజేపీలో చేర్చుకొని ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోంది. ఇప్పటికే ఓసారి ట్రై చేసింది కూడా. ఇప్పుడు టీఆర్ఎస్ లో పదవులు, నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా బయటపడుతుండడం కేసీఆర్ కు షాకింగ్ అనే చెప్పాలి. వీరందరూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైపు మళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక బీఆర్ఎస్ లో మేడ్చల్ లో మొదలైన ఈ లొల్లి కంట్రోల్ చేయకపోతే అన్ని జిల్లాల్లోనూ రిపీట్ కావడం ఖాయమన్న చర్చ సాగుతోంది. ఎన్నికల వేళ ఇది కేసీఆర్ ను మరింత దెబ్బతీస్తుందని అంటున్నారు. కేసీఆర్ కు ముందుంది ముసళ్ల పండుగ అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.