Begin typing your search above and press return to search.
మహమ్మారి పాజిటివ్ ..పెళ్లి - శోభనం..అంతలోనే అంత్యక్రియలు!
By: Tupaki Desk | 3 July 2020 2:30 AM GMTఓ కుటుంబం తెలిసిన చేసిన పొరపాటు కారణంగా ఓ అమాయకురాలి నూరేళ్ళ జీవితం బలైపోయింది. అలాగే వందలాది మందికి వైరస్ భయం పట్టుకుంది. కొడుక్కి వైరస్ ఉందేమో అన్న అనుమానం ఉన్నా కూడా పట్టుపట్టి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించారు . ఆ తరువాత శోభనాన్ని కూడా జరిపించేసారు. కానీ, పెళ్లి అయిన ఐదు రోజులకే ఆ పెళ్లి కొడుకు ప్రాణాలు వైరస్ కారణంగా గాలిలో కలిసి పోయాయి. వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిసినా పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు పెళ్లి కుమార్తె తో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల ప్రాణాల తో చెలగాటం ఆడారని వెలుగు చూడటంతో వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ఉత్తర కన్నడ జిల్లా కలెక్టర్ హరీష్ కుమార్ ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడు బెంగళూరు చేరుకుని విద్యాభ్యాసం చేశాడు. ప్రస్తుతం ఆ యువకుడు అక్కడే ఉద్యోగం చేస్తూ హ్యాపీగా జీవితం సాగిస్తున్నాడు. బత్కల్ కు చెందిన యువకుడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం మంగళూరు లో కాపురం ఉంటున్నారు. యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ వైరస్ మహమ్మారి తాండవం చేస్తున్న సమయం లో లాక్ డౌన్ విధించిన తరువాత ఆ యువకుడికి బత్కల్ ప్రాంతం లోనే వారికి నచ్చిన పెళ్లి కుమార్తె చిక్కింది. బెంగళూరు లో ఉంటున్న బత్కల్ యువకుడికి వివాహం నిశ్చయం కావడం తో వారం రోజుల క్రితం అతను మంగళూరు వెళ్లాడు. తరువాత మంగళూరు నుంచి కుటుంబ సభ్యుల తో కలిసి సొంత ఊరు అయిన బత్కల్ చేరుకున్నాడు
బత్కల్ వెళ్లినప్పటి నుంచి పెళ్లి కొడుకు దగ్గు, జలుబు, జ్వరంతో భాదపడుతున్నాడు. తనకు అనారోగ్యంగా ఉందని పెళ్లి కొడుకు అతని కుటుంబ సభ్యులకు చెప్పాడని తెలిసింది. అయితే , దాన్ని వారి కుటుంబ సభ్యులు దాచి వుంచారు. పెళ్లి కొడుకు అనారోగ్యంతో ఉన్న విషయాన్ని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెట్టిన అతని కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం బత్కల్ లో పెళ్లి జరిపించారు. తరువాత పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె వారి కుటుంబ సభ్యులు మంగళూరు చేరుకున్నారు. పెళ్లి జరిగిన రోజే నవవధూవరుల శోభనం జరిగిపోయింది. శోభనం జరిగిన మరుసటి రోజు పెళ్లి కొడుకు తీవ్రఅనారోగ్యానికి గురై కుప్పకూలిపోయాడు. వెంటనే పెళ్లి కొడుకుని మంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. వైరస్ లక్షణాలతో తీవ్రఅనారోగ్యానికి గురైన పెళ్లి కొడుకు చికిత్స విఫలమై బుధవారం ఆసుపత్రిలోనే మరణించాడు.
దీనితో వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వైద్య శాఖ అధికారులు ఆసుపత్రి చేరుకుని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులను విచారణ చెయ్యడంతో అసలలు విషయాలు వెలుగు చూశాయి. అదే సమయంలో పెళ్లి కొడుక్కి కరోనా పాజిటివ్ అని వైద్య నివేదిక వచ్చింది. పెళ్లి కొడుకు అనారోగ్యం విషయాన్ని దాచిపెట్టి గుట్టుగా పెళ్లి చేసిన అతని కుటుంబ సభ్యులను మీరు మనుషులా ? మూర్ఖులా ? అని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అలాగే వ్యాధి లక్షణాలు ఉన్నాయి అని తెలిసినా కూడా దాచిపెట్టి అనేకమంది ప్రాణాలతో చెలగాటం ఆడిన స్తూ పెళ్లి కొడుకు కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చెయ్యాలని ఉత్తర కన్నడ జిల్లా కలెక్టర్ హరీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు