Begin typing your search above and press return to search.
విశాఖ ప్రేమోన్మాది : చికిత్స పొందుతూ మరణించిన యువకుడు !
By: Tupaki Desk | 16 Nov 2021 7:36 AM GMTవిశాఖపట్నంలోని సూర్యాబాగ్ ఘటన లో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు హర్షవర్ధన్ కన్నుమూశాడు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయాడు. ఈ నెల 13న యువతిపై పెట్రోల్ పోసిన హర్షవర్థన్ తానూ నిప్పంటించుకున్నాడు. యువతి పెళ్లికి నిరాకరించిందన్న కారణంగానే హర్షవర్ధన్ దాడికి పాల్పడ్డాడని వార్తలొచ్చాయి. పెట్రోల్ దాడి కారణంగా మంటల్లో తీవ్రంగా గాయపడిన యువతి కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. సూర్యాబాగ్ ప్రాంతంలోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం ఒక యువతీ, యువకుడు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కలకలం రేపాయి. హోటల్ సిబ్బంది, స్థానికులు తలుపులు తెరిచి వారిని రక్షించి కేజీహెచ్ కు తరలించారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లాబహుపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్ , నగరంలో కరాస ప్రాంతానికి చెందిన ఓ యువతి కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరిద్దరికి కాలేజ్‌లో పరిచయం ఉంది. అయితే ఆ యువకుడికి యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా చెబుతున్నారు. హర్షవర్దన్ గత శుక్రవారం విశాఖలోని హోటల్‌కు చేరుకున్నాడు. అతడు వచ్చిన విషయం చెప్పి.. మాట్లాడాలని కోరడంతో యువతి కూడా హోటల్‌కు వచ్చింది. అయితే అక్కడ యువతిని తనను పెళ్లి చేసుకోవాలని హర్షవర్దన్ కోరాడు. అయితే అందుకు యువతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హోటల్ ల్ గదిలోనే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఈ ఘటనలో యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాధితులిద్దరిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్ రెడ్డి, విశాఖకు చెందిన సదరు యువతి పంజాబ్ లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. అంతేకాకుండా కాలేజ్ లో వారి మిత్రులతో మాట్లాడి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలించారు. మరోవైపు కూతురికి ఇలా జరిగిందని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుమద్దుగా పెంచుకున్న ఇలా చూసి తట్టుకోలేకపోతున్నారు.