Begin typing your search above and press return to search.
యువతి ఫేక్ కిడ్నాప్.. ఎందుకోసమంటే?
By: Tupaki Desk | 21 Dec 2022 4:05 AM GMTప్రేమలో ఉన్ వారు ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. తమ ప్రేమను దక్కించుకోవడం కోసం ప్రేమికులు ఎంత దూరమైన వెళుతుంటారు. ఇక పెద్దవాళ్లను ఎదురించి పెళ్లి చేసుకోవడం ప్రేమికులకు పెద్ద లెక్కే కాదు. ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో మన కళ్లే ముందే ఎన్నో జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి.. భవిష్యత్తులో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్రేమికుడినో.. ప్రేయసినో దక్కించుకునేందుకు ప్రేమికులు ఇద్దరు పడరాని పాట్లు పడుతుంటారు. పెళ్లి చేసుకుందామని ఇంట్లో పెద్దవాళ్లకు చెబితే కొందరు ఒప్పుకొని పెళ్లి చేస్తే.. మరికొందరు వారి పాలిట విలన్లుగా మారుతుంటారు. ఈ క్రమంలోనే ఆ ప్రేమికులు సినిమా స్టైల్లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడమో లేదంటే ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు తీసుకోవడమే చేస్తుంటారు.
తాజాగా ఓ 18 ఏళ్ల యువతి తన ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. తన తల్లిదండ్రుల దృష్టిని ప్రియుడిపై పడకుండా ఉండేందుకు తానే కిడ్నాప్ డ్రామా ఆడింది. ఈ సంఘటన నేడు తెలంగాణలో సంచలనంగా మారింది. ఈక్రమంలోనే యువతి కిడ్నాప్ వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.
అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఆ యువతి తన ప్రేమికుడితో ఉన్న వీడియోను విడుదల చేసింది. "నా ప్రేమికుడిని పెళ్లి చేసుకునేందుకు.. నా తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకు.. పూర్తి అవగాహనతో.. అంగీకారంతోనే ఈ పని చేశానంటూ" వీడియోలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో పోలీసులు సైతం యువతి తన ప్రియుడి పెళ్లి చేసుకునేందుకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు గుర్తించారు. సినిమా స్టైల్ లో మొదలైన కిడ్నాప్ కేసు చివరకు ఫేక్ అని తేలడంతో పోలీసులు.. ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వీరిద్దరూ గుడిలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న ఫోటోలు సైతం నెట్టింట్లో వైరల్ మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.