Begin typing your search above and press return to search.

అమరావతి భారీ భూభాగోతం కేసులో ఏ1 చంద్రబాబు.. మిగిలిన 13 మంది వీరేనట

By:  Tupaki Desk   |   11 May 2022 3:11 AM GMT
అమరావతి భారీ భూభాగోతం కేసులో ఏ1 చంద్రబాబు.. మిగిలిన 13 మంది వీరేనట
X
ఏపీ రాజధాని అమరావతి పేరుతో భారీ ఎత్తున భూభాగోతం సాగిందని.. దారుణమైన కుంభకోణం చోటు చేసుకుందన్న ఆరోపణలకు సంబంధించి తాజాగా కేసు నమోదైంది. అమరావతి మాస్టర్ ప్లాన్.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ డిజైన్ ముసుగులో భారీ భూదోపిడీకి పాల్పడ్డారన్నది వెల్లడైనట్లుగా సీఐడీ దర్యాప్తులో తేలినట్లుగా చెబుతున్నారు.

రోడ్డు డిజైన్ కోసం కన్సల్టెన్సీని నియమించినట్లుగా డ్రామా ఆడారని.. కానీ ముందుగా అనుకున్న డిజైనే ఖరారు చేసినట్లుగా ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు.

దీనికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పేరిట సాగిన అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ కేసు దర్యాప్తును చేపట్టింది.

సీఆర్‌డీఏ ఫైళ్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1గా.. మాజీ మంత్రి నారాయణను ఏ2గా చూపించారు. ఈ కేసులో మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చారు.

చంద్రబాబు.. నారాయణలను పక్కన పెడితే ఈ భారీ భాగోతంలో నిందితులుగా పేర్కొన్న మిగిలిన 12 మంది ఎవరన్నది చూస్తే..

ఏ1 చంద్రబాబు నాయుడు
ఏ2 పి. నారాయణ
ఏ3 లింగమనేని రమేశ్
ఏ4 లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్
ఏ5 కేవీపీ అంజనీకుమార్ డైరెక్టర్ రామక్రిష్ణ హౌసింగ్ ప్రై. లిమిటెడ్
ఏ6 హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్
ఏ7 ఎల్ఈపీఎల్ ప్రాజెక్టస్ లిమిటెడ్
ఏ8 ఎల్ఈపీఎల్ ఇన్ఫోసిటీ ప్రై.లిమిటెడ్
ఏ9 ఎల్ ఈపీఎల్ స్మార్ట్ సిటీ ప్రై. లిమిటెడ్
ఏ10 లింగమనేని అగ్రికల్చర్ డెవలపర్స్ ప్రై. లిమిటెడ్
ఏ11 లింగమనేని ఆగ్రో డెవలపర్స్ ప్రై. లిమిటెడ్
ఏ12 జయని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఏ13 రామక్రిష్ణ హౌసింగ్ ప్రై.లిమిటెడ్
ఏ14 పలువురు ప్రభుత్వ అధికారులు.. ప్రైవేటు వ్యక్తులు