Begin typing your search above and press return to search.
ఆధార్ కు మంగళం పాడనున్న కేంద్రం....!
By: Tupaki Desk | 23 Sep 2019 4:01 PM GMTభారత్ లో ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు ఉపయోగిస్తున్న ఆధార్ కార్డుకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడనున్నదా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లకు - సిమ్ కార్డులకు - ఓటర్ ఐడీకి - సంక్షేమ పథకాలకు - ప్రభుత్వ - ప్రైవేటు ఉద్యోగుల వేతనాలకు లింక్ చేయాలని గతంలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీనిపై అనేక సార్లు సుప్రీంకోర్డు ఆధార్ కార్డుల అస్థిత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు స్వస్తి చేప్పేందుకు సన్నద్ధం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో తేలిపోతుంది.
ఆయన సోమవారం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2021లో చేపట్టనున్న జనాభా లెక్కల (సెన్సస్) కోసం మొబైల్ యాప్ వాడబోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పేపర్ సెన్సెస్ నుంచి డిజిటల్ సెన్సెస్ కు ఇదొక పరివర్తన అని చెప్పారు. 2021 మార్చ్ 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రయను చేపట్టనున్నట్టు గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్ - హిమాచల్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా లెక్కింపు ప్రక్రియ అక్టోబర్ 2020 నుంచే ప్రారంభం కానున్నది. అయితే ఒకే దేశం ఒకే భాష అంశంపై వ్యాఖ్యానించి విమర్శల పాలైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడు ఒకే దేశం ఒకే కార్డు ఉండాలని ఉద్ఘాటించారు.
అంతే కాదు ప్రస్తుతం భారత పౌరులకు ఉన్న పాస్ పోర్టు - ఆధార్ - ఓటర్ కార్డు - బ్యాంక్ ఖాతా అన్నిటికీ కలిపి ఒకే కార్డు ఉండాలని అమిత్ షా అనడం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతూ 2021 జనాభా లెక్కల కోసం కేంద్రం రూ.12 వేల కోట్లు బడ్జెట్ కెటాయించామన్నారు. ఇంతకాలం దేశంలోని జనాబా లెక్కలు పేపర్లపై జరిగేవని - రాబోయే జనాభా లెక్కలు డిజిటిల్ పద్దతిలో జరుగుతాయని ఆయన అన్నారు. అందుకోసం ఓ ప్రత్యేక మొబైల్ యాప్ తయారు చేసినట్లు వివరించారు. ఒక వ్యక్తి మరణిస్తే వెంటనే జనాభా డేటాలో సమాచారం అప్ డేట్ చేయగలిగే వ్యవస్థ రావాలని అన్నారు అమిత్ షా.
సెప్టెంబర్ 2020కల్లా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ను తయారు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఒకసారి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ పూర్తయిన తర్వాత పాన్ ఇండియా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ కు ఇదే ఆధారంగా మారుతుందని చెప్పారు. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ఎన్ ఆర్ సీని ఎలాగైతే తీసుకొచ్చామో... ఎన్ పీఆర్ పద్ధతిని దేశవ్యాప్తంగా తీసుకొస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీంటికి జనాభా లెక్కింపు ద్వారానే అందుతాయని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను గమనిస్తే ఆధార్ కార్డుకు మంగళం పాడినట్లే.