Begin typing your search above and press return to search.
మనుషులకే కాదు శవాలకు ఆధార్ తప్పనిసరే...
By: Tupaki Desk | 10 Feb 2020 5:30 PM GMTఆధార్ కార్డ్ ..ప్రస్తుతం మనదేశంలో తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.భారతదేశం యొక్క పౌరుడి అని గుర్తించడానికి ఈ ఆధార్ చాలా ముఖ్యం. ప్రస్తుతం ఏ పని కావాలన్నా కూడా ఆధార్ అనేది తప్పనిసరి అయిపోయింది. సిమ్ కి ఆధార్ - గ్యాస్ కి ఆధార్ - ఓటు కి ఆధార్ - బ్యాంకు అకౌంట్ కి ఆధార్ ..ఇలా ప్రతి దానికి ఆధార్ లింక్ అంటూ ప్రజలని బెంబేలెత్తిస్తున్నారు. ఆధార్ తో లింక్ చేపించుకోకపోతే మీకు ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలు లభించవు అని ప్రచారం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పొందటానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కానీ , ఈ ఆధార్ లో తప్పులు దొర్లితే మార్పు చేసుకోవడం చాలా కష్టంగా మారుతోంది. అయితే ఇప్పటివరకు ఈ ఆధార్ బ్రతికున్న వారిని మాత్రమే హింసిస్తుంది అనుకుంటే ..తాజాగా శవాలని కూడా వదిలిపెట్టడంలేదు. చనిపోయిన తరువాత కూడా వారి ఆత్మకి ప్రశాంతత లేకుండా చేస్తుంది ఈ ఆధార్ కార్డ్. అదేంటి శవాలకు - ఆధార్ కి లింక్ ఏంటి అనుకుంటున్నారా ...చనిపోయినవారి శవాలని దహనం చేయాలన్న కూడా ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఈ ఘటన బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) అధికారిక శ్మశానాల్లో దహనం చేసేందుకు అనుమతించని పరిస్థితి బెంగళూరు నగరంలో వెలుగుచూసింది.
ప్రభుత్వం పథకాల ఫలాలని పొందటానికి ఆధార్ తప్పనిసరి అని సుప్రీం తెలిపినప్పటికీ కూడా , ఒక శవాన్ని దహనం చేయడానికి కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరి అని చెప్పడంతో బీబీఎంపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగళూరు నగరంలోని విజయనగర్ కు చెందిన రాజేష్ అనే ఓ యువకుడి మేనత్త మరణించడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులతో కలిసి సుమనహళ్లి మున్సిపల్ శ్మశానవాటికకు తీసుకువచ్చాడు.
అయితే , ఆ శ్మశానవాటిక సిబ్బంది శవ దహనానికి అభ్యంతరం తెలిపింది. ఈ స్మశానవాటికలో అంత్రక్రియలు చేయాలంటే మృతురాలి ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలని, ఆ నంబరుతో ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేయాలని తెలిపారు. దీనితో కాసేపు వారితో వాదించి - చేసేదేమిలేక ..వారు చెప్పినట్టు చేసాడు. అయితే , మృతురాలి పేరిట ఉన్న ఆధార్ కార్డు పోవడంతో సమీపంలోని నెట్ సెంటరుకు వెళ్లి ఈఆధార్ కోసం ప్రయత్నిస్తే రిజిస్టరు మొబైల్ నంబరు సిమ్ బ్లాక్ అయ్యింది. దీంతో మరో మొబైల్ నంబరుని ఆధార్ కార్డ్ కి కనెక్ట్ చేసి - ఆధార్ కార్డ్ తీసుకువచ్చాకే మున్సిపల్ అధికారులు ఆమె శవాన్ని దహనం చేయడానికి అనుమతించారు. బెంగళూరు మహానగర పాలిక అధికారులు నగరంలో 46 శ్మశానవాటికలు నిర్వహిస్తున్నారు. ఆధార్ కార్డు ఉంటేనే తాము శ్మశానవాటికలో శవదహనానికి అనుమతిస్తామని మహానగర పాలిక అధికారులు చెప్పడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏమైనా కూడా ఇప్పటివరకు ఆధార్ కష్టాలు బ్రతికున్నవారికే అని అనుకున్నాం ..కానీ , చనిపోయినవారి కూడా ఆధార్ తిప్పలు తప్పలేదు అని చెప్పాలి ..