Begin typing your search above and press return to search.
రాజధాని కి భూములు.. త్యాగం కాదు, వ్యాపారంః ఆళ్ల హాట్ కామెంట్
By: Tupaki Desk | 6 Jan 2020 8:47 AM GMTఒకవైపు అమరావతి ప్రాంతంలోని మూడు గ్రామాల్లో రాజధాని నిరసనలు సాగుతూ ఉన్నాయి. పాలన అంతా అమరావతి నుంచినే సాగాలనేది అక్కడి వారి డిమాండ్. రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టే జగన్ చేయాలని వారు అంటున్నారు. అయితే మూడు ప్రాంతాల వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని అమలు చేయడం విషయంలో జగన్ మోహన్ రెడ్డి అసలు తగ్గేట్లుగా లేరు. కానీ టీడీపీ వర్గాల డిమాండ్ మాత్రం అలానే ఉంది. అమరావతి.. రైతులు.. త్యాగం.. అని వారు అంటున్నారు.
ఈ విషయంలో ఇన్నాళ్లూ ఆచితూచి స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇప్పుడు ఘాటుగా స్పందిస్తున్నారు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలే ఈ విషయంలో కౌంటర్లు మొదలుపెట్టారు. డిఫెన్స్ లో పడటం కాకుండా.. వాళ్లే కౌంటర్లు ఇస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన వారిది ఎంతమాత్రమూ త్యాగం కాదని అంటున్నారు ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. రాజధానికి భూములు ఇవ్వడం త్యాగం కాదని, అది కేవలం వ్యాపారమే అని ఆయన అంటున్నారు.
ఆ మేరకు ఆశపడే రాజధానికి భూములు ఇచ్చారని ఆయన అంటున్నారు. రాజధానికి తను భూమి ఇచ్చినా.. అది వ్యాపారమే అవుతుందని ఆళ్ల అంటున్నారు. ఆ మేరకు ఒప్పందాలు చేసుకున్నారన్నారు. రాజధాని విషయంలో ఆళ్లను ఇరకాటంలో పెట్టడానికి మొదటే ప్రయత్నాలు జరిగాయి. ఆయన కనిపించడం లేదంటూ.. పోలిస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు కొంతమంది. అలా ఆళ్ల డిఫెన్స్ లో పడాల్సింది. కానీ ఆయన ఇప్పుడు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు.
అలాగే కారెం శివాజీ కూడా ఇదే వాదన చేశారు. రాజధానికి అంటూ ఎవరూ భూములు ఉచితంగా ఇవ్వలేదని, భారీ ఎక్స్ పెక్టేషన్స్ తోనే వాళ్లు భూములను ఇచ్చారని కారెం అన్నారు. భూములతో వ్యాపారం చేద్దామని చూశారని, ఇప్పుడు ఆ వ్యాపారం దెబ్బతిందని ఆయన వ్యాఖ్యానించారు.