Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ దుకాణ్ ఎందుకు బందయిందంటే..?

By:  Tupaki Desk   |   20 Jan 2016 12:43 PM GMT
అమీర్ ఖాన్ దుకాణ్ ఎందుకు బందయిందంటే..?
X
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ ను ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తప్పించడం వెనుక ఆయన చేసిన వ్యాఖ్యలే కారణమన్న అనుమానాలు నిజమేనన తేలిపోయింది. అది కారణం కాదని గతంలో బీజేపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ తాజాగా ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ కార్యదర్శి అమితాబ్ కాంత్ మాత్రం అదే కారణమని ధ్రువీకరించారు. అమీర్ భారత్ బ్రాండ్‌ ఇమేజికి నష్టం కలిగించారని, అందు వల్లే ఆయన్ను ఇన్‌ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌ గా తొలగటించారని ప్రకటించారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌ గా వ్యవహరించిన ఆయన ఆ బ్రాండ్‌ ను పెంచేలా కృషి చేయాలి తప్ప నష్టం కలిగించరాదు, ఆయన్ను తొలగించడం సరైన చర్యే అని ఆయన అన్నారు.

'ఇన్‌ క్రెడిబుల్‌ ఇండియా' బ్రాండ్‌ అంబాసిడర్‌ గా సుమారు పదేళ్ళపాటు అమీర్‌ ఖాన్‌ పనిచేశాడు. అయితే దేశంలో మత అసహనం పెరిగిపోతోందనీ, ఈ దేశంలో తనకు భద్రత లేదని తన భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ వేరే దేశం వెళ్ళిపోదామని కోరిందంటూ అమీర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ పరిణామాల ఫలితమే అమీర్ ఖాన్ ను తొలగించేలా చేసాయి. మొదట ఆయన తొలగింపునకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ‘ఇన్‌ క్రెడిబుల్‌ ఇండియా' అనే అంశానికి సంబంధించి ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించామనీ, ఆ ఏజెన్సీ తీసుకున్న నిర్ణయమని వాదించారు. అయితే.... ఇప్పుడు అధికారికంగా అమీర్‌ ఖాన్‌ తొలగింపుపై ఓ అధికారి స్పష్టతనివ్వడం చర్చనీయాంశం అయింది. మొత్తానికి అమీర్ నోటి దురదే ఆయన పదవి పోయేలా చేసిందని తేలింది.