Begin typing your search above and press return to search.
ఎలక్షన్ వస్తుందంటే చాలు..డబ్బుల్లేవనే సీఎం
By: Tupaki Desk | 22 Aug 2016 3:39 PM GMTతరచూ తనను తాను సామాన్యుడిగా చెప్పుకునే అలవాటు ఆమ్ ఆద్మీ అధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఒక అలవాటుగా చెప్పాలి. ఆయనలో మరో కోణం కూడా ఉంది. ఎన్నికలు దగ్గరకు వస్తుందంటే చాటు.. బీదరికపు మాటలు మాట్లాడటం మామూలే. ముఖ్యమంత్రిగా మొదటిసారి 49 రోజుల పాటు పదవిలో ఉన్న ఆయన ఎమోషనల్ గా ఫీలై.. తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన అద్భుత మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల ముందు ఆయన తనతో డిన్నర్ చేసేవాళ్ల దగ్గర నుంచి చందాలు ఇచ్చే ఏ చిన్నఅవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు.
తమది పేద పార్టీ అని.. తమ దగ్గర డబ్బుల్లేవని.. ఎన్నికల్లో వెళ్లటానికి అవసరమైన ఆర్థిక దన్ను ఇవ్వాలని బహిరంగానే అడిగారు. కేజ్రీవాల్ పిలుపు మేరకు స్పందించిన పలువురు ఆయన కోరుకున్నట్లే నిధులు ఇచ్చారు. నిజానికి కేజ్రీవాల్ కు ఇలాంటి పేదరిక పెడబొబ్బలు కొత్తేం కావు. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన ప్రతిసారీ ఇదే తీరులో ఆయన స్పందిస్తుంటారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పార్టీ ఢిల్లీ రాష్ట్ర అధికారపక్షం. అయినప్పటికీ ఆయన పేదరికపు వ్యాఖ్యల్ని తాజాగా చేశారు. తమది పేద పార్టీ అని తమను ఆదుకోవాలంటూ ఆయన కోరటం గమనార్హం. పార్టీకి నిధులు ఇవ్వాలని.. ఎన్నికల కోసం అవసరమైన చాందాల్ని ఇవ్వాలన్న విషయాన్ని చెప్పారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏమున్నాయా? అన్న సందేహం అక్కర్లేదు. మరికొద్ది నెలల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన చందాల కోసం బయటకు వచ్చారు. తమది అధికారపక్షమైన్పటికీ తమ దగ్గర పైసా లేదన్నారు. ప్రస్తుతం గోవాలో పర్యటిస్తున్న ఆయన.. గోవాను అర్థం చేసుకోవటానికే తాను పర్యటిస్తున్నట్లుగా చెప్పారు. తమ దగ్గర డబ్బుల్లేవని.. కావాలంటే తమ బ్యాంకు అకౌంట్లు చూడాలని వ్యాఖ్యానించారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే ప్రతిసారీ బీద అరుపులు అరిచే కేజ్రీవాల్.. ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన పద్ధతిని ఏ మాత్రం మార్చుకోనట్లే కనిపిస్తోంది.