Begin typing your search above and press return to search.

బాబుకు ఆహ్వాన‌మా?...కేజ్రీ టీ రిజ‌ల్ట్స్ చూళ్లేదా?

By:  Tupaki Desk   |   3 March 2019 5:22 PM GMT
బాబుకు ఆహ్వాన‌మా?...కేజ్రీ టీ రిజ‌ల్ట్స్ చూళ్లేదా?
X
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌ - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.. ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నికల‌కు సంబంధించి ఆ పార్టీ ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్ల‌లో పోటీ చేయ‌నుంది. ఇప్ప‌టికే ఆరు సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను కూడా ఖ‌రారు చేసేసిన కేజ్రీ... ఓ క్రేజీ ప్ర‌క‌ట‌న చేశారు. ఢిల్లీలో త‌మ పార్టీ అభ్య‌ర్థుల విజ‌యం కోసం ప్ర‌చారం నిర్వ‌హించేందుకు వివిధ రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు - ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌ను పిల‌వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆయ‌న... జాబితాలో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి - ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో పాటు టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పేర్ల‌ను చేర్చారు. లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే త‌మ పార్టీ ప్ర‌చారం మొద‌లెట్టేసింద‌ని చెప్పిన ఆయ‌న‌... సెంక‌డ్ ఫేజ్ ప్ర‌చారంలో దీదీ - చంద్ర‌బాబుల‌ను దించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌మ‌త వ‌ర‌కూ ఓకే గానీ... చంద్ర‌బాబు పాద మ‌హిమ కేజ్రీకి ఇంకా తెలియ‌న‌ట్టే ఉంది.

ఇటీవ‌లే జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో జ‌ట్టుక‌ట్టి ఎన్నిక‌ల‌కు వెళ్లిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్ ప‌ట్ల ఓ మోస్త‌రు సానుకూల‌తే తెలంగాణ‌లో ఉంది. అయితే ఎప్పుడైతే... ఆ పార్టీ తెలంగాణ‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన చంద్ర‌బాబుతో జ‌త క‌ట్టిందో... తెలంగాణ ప్ర‌జ‌లు ఆ పార్టీకి గ‌ట్టిగానే బుద్ది చెప్పారు. టీడీపీకి రెండండే రెండు సీట్ల‌ను ఇచ్చిన తెలంగాణ ఓట‌ర్లు.... కాంగ్రెస్‌ కు 20 కంటే త‌క్కువగా 19 సీట్ల‌ను ఇచ్చారు. తెలంగాణ ఏర్ప‌డ్డ నాడు టీఆర్ ఎస్ ప్ర‌భంజ‌నంలోనూ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగి 21 సీట్ల‌ను గెలుచుకుంది. ఈ ద‌ఫా కేసీఆర్ స‌ర్కారు ప‌ట్ల జ‌నాల్లోని ప్ర‌భుత్వ వ్యతిరేక‌త నేప‌థ్యంలో ఈ ద‌ఫా కాంగ్రెస్‌ కు సీట్లు పెరుగుతాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగాయి.

అయితే... అందుకు విరుద్ధంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చంద్ర‌బాబుతో క‌లిసి బ‌రిలోకి దిగిందో.. ఆ పార్టీని తిర‌స్క‌రించేందుకే తెలంగాణ ఓట‌ర్లు నిశ్చ‌యించుకున్నారు. ఫ‌లితంగా టీఆర్ఎస్‌కు బంప‌ర్ విక్ట‌రీ ద‌క్క‌గా... టీడీపీతో జ‌ట్టు క‌ట్టిన కాంగ్రెస్‌ కు గూబ గుయ్యిమంది. కాంగ్రెస్‌ కు సీట్లు త‌గ్గిన వైనంపై లెక్క‌లేనన్ని విశ్లేష‌ణ‌లు రాగా... అన్నీ కూడా చంద్ర‌బాబుతో దోస్తీ కార‌ణంగానే కాంగ్రెస్ దెబ్బైపోయింద‌న్న వాద‌న వినిపించింది. మ‌రి ఈ వివరాల‌న్నీ కేజ్రీకి తెలియవో? ఏమో?... తెలియ‌దు గానీ... ఢిల్లీలో త‌న‌కు మంచి ప‌ట్టున్నా కూడా చంద్రబాబు లాంటి ఐర‌న్ లెగ్‌ ల‌ను ఆహ్వానించి త‌న పార్టీకి ప్ర‌చారం చేయ‌మ‌ని కోరుతున్నారు. కేజ్రీ పిల‌వ‌డం, బాబు వెళ్ల‌డం జ‌రిగితే మాత్రం ఢిల్లీలో ఆప్‌కు గూడ గుయ్యిమ‌నేలా తీర్పు రావ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.