Begin typing your search above and press return to search.
కేటీఆర్ తో కేజ్రీవాల్ పోటీ: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆప్ ఫోకస్
By: Tupaki Desk | 19 Feb 2020 6:00 AM GMTఎగ్జిట్ పోల్ ఫలితాలకు భిన్నంగా.. భారీ మెజార్టీతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి వచ్చారు. ప్రత్యర్థులను మట్టి కరిపించిన కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాలపై కూడా కన్నేశారు. గతంలోనే ఇతర రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నించారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తన పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్నాడు. ముఖ్యంగా ఢిల్లీపై ఫోకస్ పెట్టిన ఆయన ఇప్పుడు ఢిల్లీని మూడోసారి తను దక్కించుకోవడంతో ఇప్పుడు ఆయన టార్గెట్ మారింది. తన తర్వాతి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
ఢిల్లీ ఫలితాల ఉత్సాహంతో పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తున్నారు. ఢిల్లీలో తమ విజయానికి సుపరిపాలనే కారణంగా పేర్కొంటూ ఇతర రాష్ట్రాల్లో పాగ వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తారని సమాచారం. తెలంగాణ లో ముఖ్యంగా త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ విధానం అమలుచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల్లో సత్తా చాటేలా ముందుకుసాగాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికలకు ఆప్ తరఫున ప్రచారం చేసేందుకు కొంతమంది హైదరాబాద్ కు చెందని పార్టీ కార్యకర్తలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆప్‌కు ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఢిల్లీ తరహా పాలన చేస్తామనే హామీలతో ప్రజల ముందుకు వెళ్లాలని ఆప్ నాయకులు చెబుతున్నారు.
హైదరాబాద్‌తోపాటు ఇకపై దేశంలో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తాము పోటీ చేయాలనుకుంటున్నట్టు ఇటీవల ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ ప్రకటించాడు. దీంతో హైదరాబాద్ పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జీహహెచ్ఎంసీ ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నారు. ఆ ఎన్నికల సమయంలో కుదిరితే కేజ్రీవాల్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి ప్రచారం చేయించాలని కూడా ఇప్పటి నుంచే ప్లాన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ తరఫున టికెట్లు రానివారు తమ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వాళ్లు గెలిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందనే భావనలో ఉన్నారు.
ఆప్ ముఖ్యంగా నగరాలు, పట్టణాలపై ఫోకస్ పెట్టింది. పార్టీని విస్తరించుకోవడంతోపాటు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి వాలంటీర్లను సిద్ధం చేసుకునే పనిలో ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి తమ పార్టీని విస్తరించుకుంటే భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో పార్టీని విస్తరించే యోచనలో ఉన్నారు. నగరాల్లో పార్టీ విస్తరిస్తే అనంతరం మెల్లగా పట్టణాలు, గ్రామాల్లోకి కూడా ప్రవేశించేందుకు ఆశలో ఉన్నారు.