Begin typing your search above and press return to search.
మనదగ్గరే: గంట కరెంట్ పోతే రూ.50 చెల్లిస్తారట
By: Tupaki Desk | 17 April 2018 6:16 PM GMTఏంటి...నమ్మబుద్ధి కావడం లేదా? మన దగ్గర కరెంటు పోకుండా ఉంటుందా? అదే ఓ వింత అనుకుంటే...తిరిగి మనకే డబ్బులు ఇవ్వడం అనే కలలో కూడా జరగని పనిని చెప్తే నమ్మేస్తామా? అంటున్నారా? నిజంగా నిజమండి బాబు. ఇదుగో ఇవే ఆ వివరాలు. సహజంగా మన ఇంట్లో కరెంట్ పోతే పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేం. అదే ఓ గంటకు పైగా సమయం గడిస్తే వెంటనే విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి ఆరా తీస్తాం. ఒక వేళ వారు స్పందించకపోతే కరెంట్ వచ్చేవరకు ఇబ్బంది పడుతూనే ఉంటాం. ప్రజలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా - కరెంట్ కోతలపై అధికారులు విన్నవించిన వారు పట్టించుకున్న సందర్భాలు చాలా అరుదు. ఇక ఇలాంటి కరెంట్ ఇబ్బందులకు చెక్‌పెట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు.
ఆప్ అధినేత మదిలో పుట్టిన ఈ పాలసీ కరెంట్ కోతలతో తీవ్రంగా బాధపడుతున్న వినియోగదారులకు లాభం చేకూర్చడం లక్ష్యంగా రూపొందింది. ఇంతకీ ఆ పాలసీ ఏంటంటే....విద్యుత్ పంపిణీ కంపెనీలు అనధికార విద్యుత్ కోతలు విధిస్తే..కరెంట్ పోయినప్పటి నుంచి మొదటి రెండు గంటల పాటు ఒక్కో గంటకు రూ.50 చొప్పున.. రెండు గంటలు దాటితే తరువాతి ఒక్కో గంటకు రూ.100 చెల్లించడం. ఇలా కొత్త పాలసీని రూపొందించారు. ఇంతకీ ఈ పని ఎందుకు చేశారంటే..ఇలా ఫైన్ వేయడంతో డిస్కంలు మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాయని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిహారం మొత్తాన్ని సంబంధిత పంపిణీ వ్యవస్థ ఆటోమేటిక్‌గా వినియోగదారుడికి జమ చేస్తుందని, ఇందులోంచి కరెంట్ బిల్లును సర్దుబాటు చేయనున్నారు. ఈ పాలసీ తుది ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ దగ్గరకు ప్రభుత్వం పంపించింది. భారత్‌లో ఇలాంటి పవర్ కన్జూమర్ కంపెన్‌సేషన్ పాలసీని తీసుకురావడం ఇదే తొలిసారి.