Begin typing your search above and press return to search.
బీజేపీ కంటే ఆప్ బెటర్... ?
By: Tupaki Desk | 14 March 2022 12:30 AM GMTఒక ఉన్నత విద్యావంతుడు రాజకీయాల్లోకి వచ్చి అక్కడ మార్పు తీసుకురావడం అంటే ఎక్కడో కధలలో సినిమాల్లోనే జరిగే విషయం. కానీ రియల్ లైఫ్ లో దాన్ని సాధించిన నాయకుడిగా భారత దేశంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ కి ఎపుడూ కీలక స్థానం ఉంటుంది. ఆయనలో ఉన్నది క్రమశిక్షణ. లేనిది అవినీతి. ఇక కులాల కంపు, మతాల పిచ్చి కూడా ఆయనకు అసలు లేదు. ప్రాంతాల, వర్గాల హద్దులు అడ్డుగోడలను దాటుకుని రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళే సమర్ధత ఆయనకు ఉందని ఈ పాటికే రుజువు అయింది.
రాజకీయం అంటే వ్యాపారం అని అంతా భావిస్తున్న వర్తమాన రోజులలో దానికి ఒక పవత్ర సేవగా మార్చడం ద్వారా ఆప్ దేశంలో ఒక అతి పెద్ద చర్చకు దారితీస్తోంది అంటే అందులో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆచరణకు దూరంగా ఉండే హామీలు ఇవ్వడం లేదు. సంక్షేమం పేరుతో అప్పులు తెచ్చి చిల్లరగా పంచడంలేదు.
అభివృద్ధిని సాధిస్తూనే ఎవరికి ఏది అవసరమో దానిని నెరవేరుస్తున్నారు. విద్య, వైద్యం అన్నవి అతి ముఖ్య రంగాలని గుర్తించి వాటి మీద బడ్జెట్ లో ఎక్కువ ఖర్చు చేస్తున్న ఘనత ఆయనదే. అందులే మూడు విడతలుగా ఢిల్లీలో గెలిచిన ఆప్ పంజాబ్ లో కూడా తాజాగా దుమ్ము రేపింది.
ఇదిలా ఉంటే ఆప్ ఎక్కడో ఉత్తరాది పార్టీ కదా, సౌత్ న ఆదరిస్తారా అంటే తప్పకుండా అన్న మాట అయితే వినిపిస్తోంది. ఇక ఆప్ వంటి పార్టీలు రంగంలో ఉంటే మేధావులు, విద్యావంతులు, చదువరులు, మిడిల్ క్లాస్ ఓట్లకు గిరాకీ పెరుగుతుంది. వారంతా ఓపికగా వచ్చి మరీ బూతుల్లో నిలబడి ఓట్లేస్తారు.
ఒక విధంగా ఆప్ మాదిరిగనే ఆదర్శవంతమైన పాలన అంటూ లోక్ సత్తా ఏపీలో 2009లో నే రాజకీయ ప్రయోగం చేసింది. జయ ప్రకాష్ నారాయణకు మొదటి దఫాలోనే మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ఏపీలో అయితే లోక్ సత్తా తరఫున నిలబడ్డ ప్రతీ అభ్యర్ధికీ వేయి నుంచి మూడు వేలకు తక్కువ కాకుండా ఓట్లు వచ్చాయి. లోక్ సత్తాను అలాగే కంటిన్యూ చేసి ఉంటే ఈ పాటికి ఎన్ని వండర్స్ క్రియేట్ చేసి ఉండేదో కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. లోక్ సత్త ఒక్క ఎన్నికకే పరిమితం అయింది.
అయితే మాత్రం లోక్ సత్తా ఓట్లు అలాగే ఉన్నాయి. అవి ఇంకా పెరిగే చాన్స్ కూడా ఉంది. నానాటికీ విద్యావంతులు, మేధావుల ఓట్లు వేయడం మానుకున్నప్రస్తుత పరిస్థితులలో ఆప్ కోటి ఆశలు పెంచుతోంది. 2024 ఎన్నికల్లో ఆప్ కనుక ఏపీలో పోటీ చేస్తే కచ్చితంగా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.
ఇక ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలసి పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ బీజేపీ కంటే కూడా ఆప్ తో పొత్తు చాలా బెటర్ అన్న మాట అయితే ఇపుడు టీడీపీలో చర్చకు వస్తోందిట. ఆప్ కనుక బరిలో ఉంటే కొత్త పార్టీ అన్న ఫ్రెష్ లుక్ తో పాటు అవినీతి కి వ్యతిరేకం, అభివృద్ధికి సోపానం అన్న అంశాల మీద ఏపీ జనాలు టర్న్ అయ్యే సీన్ ఉంటుంది.
ఇక ఇళ్లకే పరిమితం అయిన మిడిల్ క్లాస్ సహా చాలా వర్గాల ఓట్లను ఆప్ బయటకు రప్పించే సత్తాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగుతాయనడంలో సందేహం లేదు. ప్రతీ ఓటూ కీలకమే అని కూడా ఇక్కడ చెప్పాలి. అలాంటి పరిస్థితిలో ప్రతీ అసెంబ్లీ సెగ్మంట్ లో కనీసం మూడు వేల ఓట్లను సంపాదించే సత్తా ఉన్న ఆప్ తో దోస్తీ అంటే కచ్చితంగా టీడీపీకి విజయావకాశాలను పెంచేదే అవుతుంది అంటున్నారు.
ఇక ఆప్ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం కచ్చితంగా అది విపక్షాలకు నష్టదాయకం అని చెప్పాలి. ఓట్ల చీలికతో వైసీపీకి వరంగా మారుతుంది. అందువల్ల ఆప్ తో పొత్తునకు టీడీపీ ఎలాగైనా చూస్తుంది అంటున్నారు. ఇక అరవింద్ కేజ్రీ వాల్ తో చంద్రబాబుకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఏపీలో చంద్రబాబు విజయానికి 2019 ఎన్నికల వేళ విశాఖ వచ్చి మరీ కేజ్రీ వాల్ ప్రచారం చేశారు.
అయితే ఇక్కడ ఒక చిక్కు మాత్రం టీడీపీకి ఉంది. అదెలా అంటే ఆప్ తో పొత్తు పెట్టుకుంటే రేపటి రోజున బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇబ్బంది అన్నదే ఆ చర్చ. మరి అలాంటి శషబిషలకు తావివ్వకుండా ఒక స్టాండ్ టీడీపీ తీసుకుంటే మాత్రం ఆప్ మోజూ, కేజ్రీవాల్ క్రేజూ అన్నీ టీడీపీకి బాగా కలసివస్తాయని తమ్ముళ్ళు విశ్లేషిస్తున్నారుట.