Begin typing your search above and press return to search.
భార్యల్ని వదిలేస్తే ప్రధాని కావొచ్చట
By: Tupaki Desk | 30 Dec 2017 10:46 AM GMTట్రిపుల్ తలాక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. ఇప్పటివరకూ ఈ అంశంపై పెద్దగా స్పందించని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెగటు పొగలు పుట్టిస్తోంది. తలాక్ బిల్లుకు కౌంటర్ అన్నట్లుగా సంధించిన ట్వీట్ కౌంటర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి జైలుశిక్ష విధించేలా బిల్లును లోక్ సభలో ఆమోదం పొంది.. రాజ్యసభ ఆమోదం దిశగా అడుగులు పడుతున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్క లంబ వివాదాస్పద ట్వీట్ పోస్ట్ చేశారు.
అసలు ట్రిపుల్ తలాక్ చెప్పటం ఎందుకు? జైలుకు వెళ్లటం ఎందుకు? హాయిగా భార్యను వదిలేసి వెళ్తే ఏకంగా దేశానికి ప్రధాని అయిపోవచ్చు కదా? అంటూ ఆమె వివాదాస్పద ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రధానమంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తి మీద అనుచితంగా ఈ తీరులో ట్వీట్ చేస్తారా? అని మండిపడుతున్నారు.
మరికొందరు మాత్రం.. లంబా చేసిన ట్వీట్ లో తప్పేముంది? నిజాన్నే.. తనదైన స్టైల్లో ట్వీట్ చేశారంతే కదా? అని ఎదురుప్రశ్నిస్తున్నారు ప్రధానిని కించపరిచేలా ట్వీట్ చేసిన లంబ పై చర్యలు తీసుకోవాలని కమలనాథులు.. డిమాండ్ చేస్తున్నారు. మరి.. దీనిపై ఆమ్ ఆద్మీ చీఫ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.