Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యే బావమరిది భార్యను వద్దలేదట
By: Tupaki Desk | 12 Sep 2016 5:10 PM GMTపేరుకు సామాన్యుల పార్టీ అనే కానీ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మీద వచ్చే నేరారోపణలు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఆదర్శాలు వల్లె వేస్తూ.. ప్రజలకు ఏదో చేస్తామని చెప్పి.. ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై వస్తున్న లైంగిక ఆరోపణలు షాకింగ్ గా మారాయి. ఈ మధ్యనే ఆమ్ ఆద్మీకి చెందిన మంత్రి ఇద్దరు మహిళలతో కలిసి రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటనకు చెందిన వీడియో బయటకు వచ్చి మంత్రి పదవి పోగొట్టుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ పై ఆయన బావమరిది భార్య చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలో తనపై అమానతుల్లా ఐదుసార్లు లైంగిక దాడి చేసినట్లుగా కోర్టుకు వెల్లడించారు. ఒకసారి అయితే లిఫ్ట్ లోనే తనపై లైంగిక దాడి చేసినట్లుగా వెల్లడించారు.
ఈ ఉదంతంపై తన భర్తకు ఫిర్యాదు చేస్తే.. ఎమ్మెల్యే తనకు వ్యాపారంలో సాయం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఎలా చెబితే అలా నడుచుకోవాలంటూ తన భర్త చెప్పినట్లుగా ఆమె కోర్టుకు వెల్లడించారు. తనకు.. ఎమ్మెల్యేకు మధ్య జరిగిన సంభాషణకు చెందిన ఒక సీడీనీ.. పెన్ డ్రైవ్ ను ఆమె పోలీసులకు ఇచ్చారు. తాను భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నానని.. అద్దె ఇంట్లో ఉంటూ కూతుర్ని చదివించుకున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన మనుషులు తనను బెదిరిస్తున్నారని.. తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరుతున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.