Begin typing your search above and press return to search.
పిల్లలకు స్కూలు ఫీజు కట్టలేని ఎమ్మెల్యే
By: Tupaki Desk | 25 Dec 2015 6:47 AM GMT ప్రజా ప్రతినిధులంటే ఎవరికైనా ఒకరకమైన అభిప్రాయం ఉంటుంది... డబ్బుకు కొదవ ఉండదని... అడ్డగోలుగా సంపాదిస్తారని... తమ పలుకుబడిని ఉపయోగించుకుని పనులు చేయించుకుంటారని అంతా అనుకుంటారు. నిజానికి అది నిజం కూడా. ప్రజాప్రతినిధుల్లో అత్యధికులది అదే పద్ధతి. కానీ, నూటికో కోటికో ఒకరు మాత్రం నీతి నిజాయితీలతో సాధారణ జీవితం గడుపుతుంటారు. వారికి మాత్రం ఎన్నో కష్టాలు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారు మాత్రం ఎక్కడా తమ నీతినియమాలను విడిచిపెట్టకుండా ముందుకు సాగుతారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. జీతం తప్ప వేరే ఆదాయం లేని ఆయన పిల్లల ఫీజులు కూడా కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీలోని ఓఖ్లా నుంచి గెలిచిన ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ దీన స్థితిని విన్నవారికి ఎవరికైనా అయ్యో అనిపిస్తుంది. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేకపోవడంతో వారిని స్కూలు నుంచి బయటకు పంపించేశారు. ఎమ్మెల్యేగా వచ్చే జీతంతోనే బతుకీడుస్తున్న ఆయన ఆరు నెలలుగా పిల్లల ఫీజులు చెల్లించలేకపోయారు. దీంతో వారిని బయటకు పంపించేశారు. ఎమ్మెల్యేగా ఆయనకు రూ.83,500 జీతం వస్తోంది... ఇది బతకడానికి సరిపోతుంది కానీ, అందులో రూ.62 వేలు ఆయన కార్యాలయ నిర్వహణకే ఖర్చవుతోంది. దీంతో మిగిలిన రూ.21,500తోనే ఆయన బతకాల్సి వస్తోంది. ఢిల్లీలో 20 వేలతో బతకడం అంత సులభమేమీ కాదు.
అయితే.... ఇటీవల ఆప్ గవర్నమెంటు ఎమ్మెల్యేల జీతాలను 400 శాతం పెంచాలని నిర్ణయించింది. అది అమల్లోకి వస్తేగానీ అమానతుల్లా ఖాన్ కష్టాలు తీరవు.