Begin typing your search above and press return to search.
పెళ్లాం ఎమ్మెల్యే అయినా వదిలిపెట్టని భర్త
By: Tupaki Desk | 2 Sep 2022 4:56 AM GMTరాజకీయాల్లో పురుషాధిపత్యం ఉంటుంది. పురుషులే శాసిస్తారు. బీహార్ సీఎం లాలూ జైలుకు వెళ్లినప్పుడు అక్షరాలు కూడా రాని రబ్రీదేవి లక్కీగా సీఎం అయిపోయింది. అలాంటి ఉత్సవ విగ్రహాల్లాంటి వారు ఉంటారు. ఇక భర్తకంటే పవర్ ఫుల్ లేడీలు కూడా ఉంటారు.
భార్య భర్త అన్నాక గొడవలు సహజం. అయితే అదీ వీధికెక్కితే మరింత డేంజర్.కానీ భార్యభర్తల ఆగ్రహావేశాలన్నీ బయటే కక్కబడుతాయి. తాజాగా పంజాబ్ లో ఎమ్మెల్యే అయిన తన భార్యను అందరి ముందే చెంప పగులకొట్టాడు ఆమె భర్త. లైవ్ లో దీన్ని చూసి పక్కనున్న వారు ఆపారు కాబట్టి సరిపోయింది.. లేదంటే ఎంతటి అనర్థం జరిగి ఉండేదే..
ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ పై ఆమె భర్త సుఖ్ రాజ్ సింగ్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జులై 10నే ఈ ఘటన జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.
కుటుంబ గొడవలతో ఇంటి బయట వాగ్వాదం జరుగుతుండగా భార్య అయిన ఎమ్మెల్యే తనపైకి వేలు చూపిస్తూ మాట్లాడడంతో తట్టుకోలేకపోయిన భర్త ఆమె చెంప పగులగొట్టాడు. పక్కనున్న కొందరు అతడిని అడ్డుకున్నారు.
ఈ ఘటనపై సుమోటాగా కేసు నమోదు చేస్తామని ఆ రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. కానీ పాపం ఆ లేడీ ఎమ్మెల్యే మాత్రం భర్తపై ఎలాంటి కేసులు పెట్టలేదు. ఇంట్లో గొడవ కాబట్టి సర్దుకుపోయింది. ఆ రాష్ట్ర మహిళా కమిషన్ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొంది. ఒఖ మహిళా ప్రజాప్రతినిధిపై చేయిచేసుకోవడాన్ని ఖండించింది.
ఇక లేడీ ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన విషయం ఆ రాష్ట్రంలో వైరల్ కావడంతో మహిళా సంఘాలు ఊరుకుంటాయా? రచ్చరచ్చ చేస్తున్నాయి. పంజాబ్ ఆప్ సర్కార్ కూడా ఇరకాటంలో పడిపోయింది. ఇటీవల కాలంలో వరుసగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా మరో తలనొప్పి ఆప్ సర్కార్ కు వచ్చిపడింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.