Begin typing your search above and press return to search.
‘‘సామాన్యుల’’ నెల జీతం రూ.3లక్షలా..?
By: Tupaki Desk | 6 Oct 2015 4:37 PM GMTతాము సామాన్యులమని.. జనసామ్యం ఈతిబాధలు తమకు తెలుసని.. తమకు అధికారం ఇవ్వాలే కానీ.. సామాన్యులకు అండగా ఉండేలా పాలిస్తామంటూ చాలానే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ. సామాన్యులమని చెప్పుకున్న ఆ పార్టీకి చెందిన కొందరు అసమాన్య నేతల వైఖరి చూసి ఇప్పటికే పలువురు షాక్ తిన్న పరిస్థితి. ఆరోపణలు.. కేసుల పుణ్యమా అని కొందరు పదవులు పోగొట్టుకుంటే.. మరికొందర్ని పార్టీనే తీసేయాల్సిన పరిస్థితి.
ఇదిలా ఉంటే.. సామాన్యులకు ఇవ్వాల్సిన జీతభత్యాల గురించి తాజాగా స్వతంత్ర కమిటీ ఒకటి రాష్ట్ర సర్కారుకు కొన్ని సిఫార్సులు చేసింది. దీని ప్రకారం.. ఇప్పటివరకూ ఉన్న జీతాన్ని రూ.12 వేల నుంచి రూ.50వేల వరకు పెంచాలని.. నియోజకవర్గ అలవెన్స్ ను రూ.18 వేల నుంచి 50 వేలకు.. వాహన అలవెన్స్ ను రూ.6 వేల నుంచి రూ.30వేలకు పెంచాలని సిఫార్సు చేసింది.
తాజా సిఫార్సులతో ప్రస్తుతం ఉన్న జీతం రూ.88 వేల నుంచి రూ.2.10 లక్షలకు పెరిగిపోయే పరిస్థితి. దీంతో పాటు.. మరికొన్ని అలవెన్సుల్ని కలిపితే.. మొత్తంగా రూ.3లక్షల వరకు పెంచాలని సిఫార్సు చేసింది. సామాన్యుల్ని పాలించటానికి సామాన్యుల పార్టీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.3లక్షల జీతాలు అవసరమా? అన్నది ఒక ప్రశ్న. మరి.. దీనికి కేజ్రీవాల్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.